Entertainment బిగ్ బాస్ ఫేమ్ హిమజ.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేదు. సీరియల్స్, సినిమాల్లో తన అందం, అభినయంతో క్రేజ్ సంపాదించుకుంది. అలా బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పలు కామెడీ షోల్లోనూ పాల్గొన్ని తనదైన కామెడీతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అయితే ఈ బుల్లితెరపై నటిస్తున్నప్పుడే వెండితెరపై మెరిసే అవకాశం దక్కించుకుని.. పలు హీరోల సినిమాల్లో నటించింది.
బిగ్‌బాస్-3 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని.. మిగిలిన సభ్యులకు గట్టి పోటీ ఇచ్చి.. కొన్నివారాల పాటు హౌస్‌లో కొనసాగింది. బిగ్ బాస్ అనంతరం హిమజకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సినిమాల్లో మరిన్ని అవకాశాలు పెరిగాయి. అలానే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా ఈ క్రమంలోనే తాజాగా ఖరీదైన ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు కొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఈ దీపావళికి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. నా కల నేరవేరింది’ అని వ్యాఖ్య రాసుకొచ్చింది. అయితే దీని ధర ఎంతో సరిగ్గా తెలీదు కానీ దాదాపు రూ.60లక్షలకు పైగా ఉంటుందని తెలిసింది. దీంతో ఆమెకు అభిమానలు కంగ్రాట్స్ చెబుతున్నారు. దీపావళి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు ఆనందంగా ఉండండి అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొంతమంది వామ్మో అంత ధర పెట్టి కొనుగోలు చేసిందా అని అంటున్నారు.