ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి (Xappie) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్ కి శ్రీకారం చుట్టింది. జ్యాపి యాప్ ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి ‘జ్యాపి స్టూడియోస్’ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు అనుదీప్, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర, ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వేడుకగా జరిగిన బ్యానర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ‘జ్యాపి స్టూడియోస్’ బ్యానర్, పోస్టర్ ని లాంచ్ చేశారు. ‘జ్యాపి స్టూడియోస్’ లాంచ్ ఈవెంట్ లో మొత్తం నాలుగు చిత్రాలని ప్రకటించారు నిర్మాతలు.
‘జ్యాపి స్టూడియోస్’ నిర్మాణంలో ప్రస్తుతం షూటింగ్ లో వున్న ‘జగమేమాయ’ పోస్టర్ ని లాంచ్ చేశారు నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్.
‘జ్యాపి స్టూడియోస్’ నిర్మిస్తున్న మరో చిత్రం ‘పతంగ్’ పోస్టర్ ని లాంచ్ చేసిన దర్శకుడు అనుదీప్.. పతంగ్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
‘జ్యాపి స్టూడియోస్’ నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా ప్రొడక్షన్ నెంబర్ 3. రూపుదిద్దుకోనుంది.
సుహాస్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకాబోతున్న ప్రొడక్షన్ నెంబర్ 4ని పోస్టర్ ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేసి నిర్మాతలకు అభినందనలు తెలిపారు.
రాజ్ తరుణ్, సుహాస్, ధన్య బాలకృష్ణ, చైతన్య, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ… సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెతున్న ‘జ్యాపి స్టూడియోస్’కి నా బెస్ట్ విశేష్. జ్యాపి స్టూడియోస్’ త్వరలో నాలుగు ప్రాజెక్ట్స్ ని మొదలుపెట్టబోతుంది. ఈ ప్రాజెక్ట్ మంచి విజయాలని సాధించాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కోటుంది. అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ‘జ్యాపి స్టూడియోస్’కి బెస్ట్ విశేష్” తెలిపారు.