Brandi Dairies Movie Released on 13th World Wide, Garuda Shekar, Sunitha Sadguru, Director Shivudu, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 13న విడుదలకు సిద్దమైన “బ్రాందీ డైరీస్”
*వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే “బ్రాందీ డైరీస్”. గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సందర్భంగా*
*చిత్ర బృందం మాట్లాడుతూ…*
కలెక్టివ్ డ్రీమర్స్ నిర్మాణం లో “బ్రాందీ డైరీస్ “సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 13న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమయింది. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన పాటలు ప్రజాదరణ పొందాయి.” శివుడు “రచన, దర్శకత్వం లో పూర్తి ఇండిపెండెంట్ సినిమాగా రూపు దిద్దుకున్న “బ్రాందీ డైరీస్ “వ్యక్తి లోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణ లతో, సహజ మైన సంఘటన లు,సంబాషణలు, పరిణితి వున్న పాత్రల తో అత్యంత ఆసక్తి కరం గా సాగుతుంది అని చిత్ర బృంద తెలిపారు. ఈ చిత్రం వాస్తవికత, వినోదాల మేళవింపు. “బ్రాందీ డైరీస్ “ఇప్పటివరకు తెలుగు లో వచ్చిన అతి పెద్ద ఇండిపెండెంట్ సినిమా గా పేర్కొన్నారు. అన్ని నాచురల్ లొకేషన్స్ లో సహజత్వానికి పట్టం కడుతు, పూర్తి గా కొత్త నటి నటులతో రూపుదిద్దుకుంది. జానపద గాయకుడు, రచయిత పెంచల దాస్ ఒక పాట ఇవ్వగా, సాయి చరణ్, హరి చరణ్, మరియు రవి కుమార్ మందా నేపధ్య గానం అందించారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ కి సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. ఇటీవలే పెంచల్ దాస్ గారు రాసిన పాట లిరికల్ వీడియో తనికెళ్ళ భరణి గారు విడుదల చేయగా పది లక్షలు వ్యూస్ అందుకొని చిన్న సినిమాల్లో రికార్డు నెలకొల్పింది .
నటీనటులు*
కథానాయకుడు : గరుడశేఖర్
కథానాయకి : సునీత సద్గురు
ఇతర నటి వర్గం : నవీన్ వర్మ, K. V. శ్రీనివాస్,రవీంద్ర బాబు,
దినేష్ మద్నే,మరియు ఇతరులు.
*సాంకేతిక నిపుణులు*
చిత్రం పేరు : బ్రాందీడైరీస్
బ్యానర్ : కలెక్టీవ్ డ్రీమర్స్
నిర్మాత : లెల్ల శ్రీకాంత్
రచన- దర్శకత్వం – శివుడు
సంగీతం : ప్రకాష్ రెక్స్
సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్
ఎడిటర్ : యోగ శ్రీనివాస్