Crime మృత్యువు ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు.. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా మారుతాయి అంటే ఎంత కష్టపడినా చివరికి ఫలితం దక్కదు అందుకే విధి రాత అంటారేమో ఇలాంటి ఓ సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది..
కాయ కష్టం చేసుకుంటూ బతుకుతున్నా ఆ కుటుంబంలో పెనుచిచ్చురేగింది.. రోజు కూలి పని చేసుకొని బతికే ఆ కుటుంబంలో చిన్న కుమారుడికి పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది అయితే ఇందుకు వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో దాతలు కోటి రూపాయలు వరకు సాయం చేశారు అయినా కానీ వారిని మృత్యువు వేరే రూపంలో వెంటాడింది.. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే బతుకు తెరువు కోసం కొన్నేళ్లుగా వీళ్లు బెంగళూరులో ఉంటున్నారు. ఇంతలో వారు చిన్న కుమారుడికి ఓ ప్రాణాంతక వ్యాధి వచ్చింది. కాయ కష్టం చేసుకునే వారికి వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో బెంగళూరుకు చెందిన ఓ విద్యాసంస్థ కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయటానికి ముందుకు వచ్చింది.. అయితే వారి పెద్ద కుమారుడిని బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి, సెప్టెంబర్ 30న తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు.
వైద్యానికి కొంత డబ్బును సమకూర్చుకున్నాక వీళ్లు చిన్న కుమారున్ని తీసుకొని ఆదివారం రాత్రి 9 గంటల 30 నిముషాలకు బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. అయితే అర్ధరాత్రి దాటాక రోడ్డు పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీని వీరు ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాలమురుగన్, సెల్వి దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి చిన్న కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది..