Movie ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. ముల్టీటాలెంటెడ్ అన్న సంగతి అందరికీ తెలుసు. హీరోగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా కెరీర్ లో రాణిస్తున్నారు. అయితే తెలుగులో సూపర్ హిట్ ఫిల్మ్స్ లో సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ గా పని చేసిన ప్రభుదేవాను.. తెలుగులో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో స్టార్ హీరోలు చిరంజీవి, రాజశేఖర్, వెంకటేశ్, బాలకృష్ణతో పాటు పలువురి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా పని చేశారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఫిల్మ్ లో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ సాంగ్ కు స్లో స్టెప్స్ కంపోజ్ చేసి ట్రెండ్ సెట్ చేశాడు ప్రభుదేవా. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అప్పుడే ప్రభుదేవాలోని టాలెంట్ ను గుర్తించారు కె.రాఘవేంద్రరావు. ఇక ఆ తర్వాత రాఘవేంద్రరావు ప్రభుదేవాను హీరోగా తెలుగులో పరిచయం చేశాడరు. ‘లవ్ స్టోరి 1999’ ఫిల్మ్ ద్వారా ప్రభుదేవా తెలుగులో హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ప్రభుదేవా నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.
ఈ సినిమాలో రెండు పాటలకు ప్రభుదేవాను కొరియోగ్రఫీ చేసుకున్నారు. ఇక అప్పటికే ప్రభుదేవా శంకర్ దర్శకత్వంలో ‘ప్రేమికుడు’ ఫిల్మ్ చేశాడరు. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది. 1994 లో వచ్చిన ప్రేమికుడు సినిమా అప్పట్లో ఓ సంచలనమనే చెప్పాలి. ప్రభుదేవా సరసన నగ్మా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. దీంతో ప్రభుదేవా కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా హీరోగా స్థిరపడిపోయాడు.