Central Governament : కేంద్ర ప్రభుత్వం టెలివిజన్ ఛానెళ్లకు కొత్త నియమాలను విధించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో కొత్త నియమాలను ప్రకటించింది. ప్రతి రోజూ 30 నిమిషాల పాటు టీవీ ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాలని స్పష్టం చేసింది. కాగా క్రీడలు, వన్య ప్రాణులు, విదేశీ ఛానెళ్లకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.
ఈ మేరకు ఆయన మేడియాతో మాట్లాడుతూ… అన్ని ఛానెళ్లు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు జాతీయాసక్తి ఉన్న కంటెంట్ ను ప్రసారం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలైన విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత, రక్షణ మొదలైన అంశాల మీద కంటెంట్ ప్రసారం చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
భారత దేశంలో ఉన్న ఛానెల్ అప్ లింగ్, డౌన్ లింక్ చేయడానికి అనుమతి ఉన్న అన్ని కంపెనీలు కూడా జాతీయాసక్తి ఉన్న సామాజిక అంశాలపై ఒక రోజులో కనీసం 30 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయాలని ఆదేశించారు. అయితే స్పోర్ట్స్ ఛానెళ్ల విషయంలో ఇలాంటివి సాధ్యపడిని చోట మినహా అన్ని ఛానెళ్లలో నేషనల్ ఇంట్రెస్ట్ కంటెంట్ ప్రసారం చేయాలని పేర్కొంది. ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు సలహాలను జారీ చేయవచ్చని ఛానెళ్లు దానికి అనుగుణంగా ప్రసారం చేయాలని ఆయన తెలిపారు.