ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఆర్ బి చౌదరి మాట్లాడుతూ.. ‘చెప్పాలని ఉంది’ మా 94వ చిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం. ఇప్పుడు మరో ప్రతిభావంతుడైన నటుడు యష్ పూరిని హీరోగా పరిచయం చేస్తున్నాం. ‘చెప్పాలని ఉంది’ యూనిక్ సబ్జెక్ట్. డబల్ పాజిటివ్ చూసిన తర్వాత యష్ నటన పట్ల చాలా తృప్తిగా వున్నాం. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. హీరోయిన్ గా చేసిన స్టెఫీ పటేల్ కి కూడా మంచి భవిష్యత్ వుంటుంది.
ఈ చిత్రంతో అరుణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే రూపొందించాం. తెలుగు తర్వాత తమిళ్ తో పాటు మిగతా భాషలో రీమేక్ చేస్తాం. ‘చెప్పాలని ఉంది’ యూనిక్ సబ్జెక్ట్. అందరికీ నచ్చుతుంది. హమ్స్ టెక్ ఫిలిమ్స్ తో కలసి ఈ సినిమా చేసాం. విజయ్ చక్కని మాటలు రాశారు. చిత్ర యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్” తెలిపారు.