Crime మధ్యప్రదేశ్ రాజధానీ భోపాల్‌లో ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఓ మూడేళ్ల చిన్నారి… ఓ కామాంధుడి కోరల్లో చిక్కింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగొస్తున్న ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై… పాఠశాల బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డాడో డ్రైవర్. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన దిృగ్భాంతి పరిచింది. ఈ అమానవీయ ఘటనకు అదే బస్సులోని మహిళా సిబ్బంది ఒకరు సహకరించడం… విచారకరం. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘోరం భోపాల్‌లో గత గురువారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భోపాల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఓ పాప….రోజూ పాఠశాలకు చెందిన బస్సులో పాఠశాలకు వెళుతుంది. విద్యార్థులందరిలో చిన్నారిదే చివరి స్టాప్… దాంతో.. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు విషయం బయటపడకుండా ఉండేందుకు… పాప బ్యాగులోని మరో జత దుస్తుల్ని మార్చాడు. ఈ మొత్తం ఘటన జరుగుతున్నప్పుడు… బస్సులోని మహిళ… డ్రైవర్‌కు సహకరించడం దిగ్బృంతి పరుస్తోంది.
పాప దుస్తులు మారడం గుర్తించిన ఆమె తల్లి.. పాఠశాలలో కనుక్కోగా… ఎవరూ మార్చలేదని చెప్పడం… కొంతసేపటికే… ఆ చిన్నారి తన వ్యక్తిగత అవయవాల దగ్గర నొప్పిగా ఉందనడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు… చిన్నారితో జరిగిన విషయం కనుక్కున్నారు. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు… ఘటనకు పాల్పడ్డ డ్రైవర్, సహకరించిన మహిళా సిబ్బందిని అరెస్టు చేశారు.