children vomiting చిన్నపిల్లలు ఏ క్షణానికి ఎలా ఉంటారో తెలియదు. ఎప్పుడో ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ ఉంటే ఏ తల్లిదండ్రుకైనా గాబరాగానే ఉంటుంది. అయితే ప్రతీ సారి భయపడాల్సిన అవసరం లేదు. జ్వరం ఉన్న ఆ లక్షణాలు లేకపోయినా కానీ ఒక్కొక్కసారి వాంతులు అవుతూ ఉంటాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం.
ఆరు నెలలోపు చిన్నపిల్లల్లో పాలు అరుగుదల సరిగ్గా లేనప్పుడు గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. వాంతులయ్యి వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు
అయితే కొన్నిసార్లు ఇవి తేలిగ్గా తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం వీటిని మనం సీరియస్ గానే పరిగణించాలి. అయితే ఎటువంటి సమయాల్లో వీటిని మనం సీరియస్ గా తీసుకోవాలని విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్ ఏదైనా కడుపులో వున్నా, లేదా ఏదైనా విష ఆహార పదార్ధం తిన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు.
ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజన్లు మారినప్పుడు వాంతులతో పాటు డయేరియా సమస్య కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే పిల్లలకు పాలు ఇచ్చే సందర్భంలో గాలి అనేది ఎక్కువగా లోపలికి పోవడం కూడా దీనికి మరొక ముఖ్య కారణమని చెప్పొచ్చు అందుకే చిన్నపిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు బాటిల్ నిండుగా నింపి ఇవ్వాలి
ఫుడ్ ఎనర్జీ వలన కలిగే వాంతుల్లో కేవలం వాంతులు మాత్రమే కాకుండా దద్దుర్లు, మొహంలో వాపు, ఒంటిపైన ఎర్రటి గీతాలు వంటివి కూడా కనిపిస్తాయి.
పిల్లలకు మూత్ర ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా వాంతులు అవుతూ ఉంటాయి.
ఒక్కసారి వాంతులు మెదడు ఇన్ఫెక్షన్ కూడా దారి తీస్తాయి. అంతేకాకుండా అపెండసైటిస్ అపెండసైటిస్ వల్ల కూడా వాంతులు అవుతూ ఉంటాయి.