Movie టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలకు తను దూరంగా ఉన్నానని.. రాజకీయమైతే తన నుంచి దూరం కాలేదని చెప్పిన ఓ ఆడియో క్లిప్ ను తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం అయింది..
మెగాస్టార్ చిరంజీవి అప్లోడ్ చేసిన ఆడియో క్లిప్ విన్నవాళ్లంతా.. ఏంటి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా.. నిజంగా ఆయనకి రాజకీయాలపై ఆసక్తి ఉందా.. అంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట వైరల్ గా మారింది. అయితే అసలు విషయం ఏంటంటే.. ఈ డైలాగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు పూర్తిగా తన సినిమాలకి సంబంధించిన విషయం. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా లో పక్క పొలిటికల్ పాత్రలో కనిపించనున్నారు చిరు. రాష్ట్ర రాజకీయాల్ని ఏకచక్రంగా శాసించే వ్యక్తి వెనుక ఉండి నడిపించే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి. అయితే ఈ సినిమాకి సంబంధించిన డైలాగుని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మలయాళ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల కానుంది.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నయనతార చిరంజీవికి చెల్లిగా కనిపించనుంది. మరో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022