Ram Charan : ఉపాసన తాజాగా జూన్ 20న పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో ముంగింది. రామ్ చరణ్ తండ్రి అయినందుకు చాలా సంతోషంలో ఉన్నారు. ఇక మెగాస్టార్ అయితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేస్తున్నారు. ఉపాసన పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో త్వరగానే డిశ్చార్జ్ చేశారు.
చరణ్, ఉపాసన తమ పాపతో చిరంజీవి ఇంటికి వెళ్లారు. దీంతో చిరంజీవి ఫ్యామిలీ తమ ఇంటికి వస్తున్న మహాలక్ష్మి కోసం ఇంటిని గ్రాండ్ గా అలంకరించారు. పాపకు వెల్కమ్ చెప్పారు. ఉపాసన తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఉపాసన పాపని ఎత్తుకొని కూర్చోగా, రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ ని ఎత్తుకొని ఉన్నారు. వెనుక వెల్కమ్ హోమ్ బేబీ అని రాసి ఉంది. చుట్టూ బెలూన్స్, ఫ్లవర్స్ తో అందంగా డెకరేషన్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో ని తన ఇనస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది . దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఉపాసన ఈ ఫోటో షేర్ చేసి.. మా చిట్టితల్లికి లభించిన ఘనస్వాగతం ఎంతో అద్భుతంగా ఉంది. మాపై ప్రేమ, అభిమానం, ఆశీస్సులు చూపించే వారందరికీ కృతజ్ఞతలు , మీ అభిమానం ఎప్పుడు మాపై ఇలానే వుండాలి అని కోరుకుంటున్నాం అని తెలిపింది. ఇక అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. పాపని చూపించమని అభిమానులు కామెంట్స్ ని వేధికగా చేసి కోరుకుంటున్నారు .చిట్టితల్లీ ఆరోగ్యంగా వుండాలి అని ఆశీర్వదించారు.