CM KCR Siricilla Tour Speech, Minister KTR, Telangana News, Telangana Politics, Telugu World Now,
Telangana News: కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు, సిరిసిల్ల సిరుల జిల్లాగా మారింది.
గొర్రెల పంపిణీకి ఎనిమిది వేల కోట్లు, ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకంపై చర్చించాం, సన్యాసులకు ఎప్పుడు అనుమానాలు ఉంటాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే కాళేశ్వరం అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలుగు మీడియా ప్రసారం చేయకున్నా ఇంగ్లీష్ మీడియా “లిఫ్ట్ ఏ రివర్” పేరిట ప్రసారం చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని వేల కోట్లు కరెంట్ బిల్లు కడతారని సన్యాసులు ప్రశ్నిస్తున్నారని 10 వేల కోట్లు అయినా కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు రైతుల ఇంట్లో బంగారు వర్షం కురిపించేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తాం. కరీంనగర్ ను సజీవ జలధారగా మార్చాము. అప్పర్ మానేరు మే నెలలో నిండుతుందా అని ఎవరైనా అనుకున్నారా, అప్పర్ మానేరు నుండి గోదావరి వరకు వందలాది చెక్ డాంలు నిర్మిస్తున్నాం, రెండవ జలధార వరద కాలువ, వరద కాలువ రిజర్వాయర్ గా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు, వరద కాలువ తో 110 కిలోమీటర్ల దూరం సజీవ జలధార గా ఉంది, రామగుండం దగ్గర చిన్న దార కోసం వెతుక్కునే పరిస్థితి ఉండేది, 180 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా మారింది, 365 రోజులు నీటితో కళకళలాడుతుంది, తెలంగాణలో 30 లక్షల కరెంట్ మోటర్ లు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలి పోయే పరిస్థితి లేకుండా చేసాం, 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాము.
మహబూబ్ నగర్ లో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేశాం, పాలమూరు పూర్తయితే మరో పది లక్షల ఎకరాలకు నీరు, ఇల్లంతకుంటలో చాలామంది దోస్తులు ఉన్నారు చిన్నతనంలో వెళ్తే కరువుతో దుఖం వచ్చేది. ఇప్పుడు కావాల్సినన్ని నీళ్ళున్నాయి, మిషన్ భగీరథతో మంచినీళ్ళ గోస పోయింది, 11 రాష్ట్రాల నుండి బృందాలు వచ్చి మిషన్ భగీరథను చూసి వెళ్లారు, సమైక్య రాష్ట్రంలో చేనేత కార్మికులు రోజు ఆత్మహత్యలు చేసుకునే వారు, బతుకమ్మ చీరలతో నేతన్నలకు భరోసా ఇచ్చాము, నిరు పేదలకు చీరలు ఇవ్వడంతోపాటు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాము, రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ రైతు భీమా వలె నేతన్నల బీమాగా త్వరలో ప్రకటిస్తాం, నేతన్న చనిపోతే ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి అందిస్తాము, చిరునవ్వుల తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నాం, సిరిసిల్లలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు, కరోనా మహమ్మారి అందరినీ పరేశాన్ చేసింది.
వైరస్ అనేక రూపాల్లో మనుషులపై దాడి చేస్తోంది, మెడికల్ కాలేజీ అంటే చదువు చెప్పే కళాశాల మాత్రమే కాదు 600 పడకల ఆసుపత్రి, సిరిసిల్ల కూడా మెడికల్ కాలేజీ వచ్చే ఏడాది ఇస్తాం, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు, నర్సులు, వైద్యులకు సెల్యూట్ చేస్తున్నా, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించారు,13 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేసుకున్నాము, నర్సింగ్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయించాం, 1500 నుండి మొదటి సంవత్సరం 5000, రెండో సంవత్సరం 6,000, మూడవ సంవత్సరం ఏడు వేల రూపాయలకు పెంచుతాం, సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తాం. ఇల్లంతకుంటలో రెండు వందల నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, 40 ఎకరాల ఐల్యాండు ఉంది దాన్ని టూరిజం సర్క్యూట్ గా మారుస్తాం, రాజన్న దేవాలయం దక్షిణ కాశీగా పేరు పొందింది, రాజన్న దేవాలయం అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తా, యాదవులను, మత్స్యకారులను వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఆదుకున్నాము.
దళిత జాతి అభివృద్ధి కోసం రాబోయే నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తాము, దళిత బిడ్డలు కాలర్ ఎగరేసుకుని బతికే విధంగా చేస్తాం, వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు అందిస్తాం, రాజన్న ప్రజల దేవుడు, అప్పర్ మానేరు ప్రాజెక్టుకు 50 కోట్లు మంజూరు, పాత ఆయకట్టును పునరుద్ధరించాలి.
ఆక్సిజన్ కొనుక్కోవడం చూస్తే సిగ్గనిపిస్తోంది, హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి, యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 12769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నాయి, అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించాం, ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు హరితహారం విజయవంతానికి కృషి చేయాలి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అకుంఠిత దీక్షతో చేయాలి, మండల పరిషత్, జిల్లా పరిషత్తు లకు సైతం నిధులు ఇస్తున్నాం, సిరిసిల్ల సిరుల జిల్లాగా మారింది.