శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ గారు సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ గారు చర్చించారు. యాగశాల ప్రాంగణం అంతా కలియతిరిగారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. యాదాద్రి ఆలయం పున:ప్రారంభం పైనా స్వామీజీతో మాట్లాడారు కేసీఆర్ గారు. మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం ఏర్పాట్లపైనా చర్చించారు.