Crime తమిళనాడు కోయంబత్తూర్ లో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో హైఅలెర్ట్ నడుస్తుంది అయితే ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు..
కోయంబత్తూర్ లో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో హైలెట్ నడుస్తోంది అయితే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి విచారన జరిపిస్తున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.. అయితే ఈ పేలుడులో మృతి చెందిన మొబిన్ సంబంధం ఉన్న మరొక ఏడుగురిని పోలీసులు విచారించారు.. అలాగే ముబిన్‌కు టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే ముబిన్‌ను గతంలో ఎన్‌ఐఏ కూడా విచారించింది.
ముబిన్ స్వయంగా కారులో పేలుడు పదార్ధాలను తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముబిన్ తన ఇంటి నుంచి సిలిండర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అలాగే కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు మొహమ్మద్, అసరుద్దీన్, రియాజ్, ఇస్మాయిల్, నవాస్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు..
అయితే ఈ బాంబు పేలుడుతో కోయంబత్తూర్ లో హై అలర్ట్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా అక్కడ ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ లో ఆలయాలు బస్టాండ్లు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అన్నింటిలో కూడా భద్రతను పెంచారు.. పోలీసులు భద్రతా బలగాలు రాపిడ్ ఫోర్స్ అందరూ కలిపి 3,000 మంది వరకు ఏ ఒకచోటను వదలకుండా మొత్తం తనిఖీలు చేశారు.. అయితే ఈ ఘటనలతో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది అసలు విషయం ఏంటి అనేది తెలుసుకోవడానికి విచారణ చేపట్టింది..