Crime సక్రమంగా పని చేయాల్సిన వాల్లే పనిని మర్చిపోయి నచ్చినట్టు చేస్తే ఎలా ఉంటుందో తాజాగా జరిగిన ఓ సంఘటన నిరూపించింది. ఫుల్లుగా తాగేసి ఉన్న బస్సు డ్రైవర్ ఆ బస్సును రోడ్డుపై ఆపేయడమే కాకుండా.. దిగి రోడ్డుపైన అడ్డంగా పడుకున్నాడు. ఈ సంఘటనతో షాక్ అయిన విద్యార్థులు ఏం చేయాలో తెలియక కాలేజ్ మేనేజ్మెంట్కు సమాచారం అందించారు.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు కాలేజ్ బస్సు డ్రైవర్ నిర్వాకం ఇది..
కాలేజ్ బస్సు డ్రైవర్ అందులో ఉన్న విద్యార్థులకు చుక్కలు చూపించాడు తాగేసి బస్సు డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు ఫుల్లుగా మద్యం తాగి ఆ బస్సును స్టార్ట్ చేసిన డ్రైవర్ అందరికీ చుక్కలు చూపించాడు సగం దారికి వెళ్ళాక మద్యం మాకు ఎక్కువ ఏం చేయాలో తెలియక దిగి రోడ్డుపైన నిద్రపోయాడు ఇదంతా చూస్తున్న అందులో ఉన్న విద్యార్థులు షాకే తమ కాలేజ్ మేనేజ్మెంట్ కు సమాచారం అందించారు దీంతో విషయం తెలుసుకున్న వారంతా వెంటనే అక్కడికి చేరుకొని విషయం పెద్దది కాకుండా ఆపారు.. బస్సు డ్రైవర్ బాలయ్య పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హడావిడిగా బస్సు వద్దకు వచ్చిన కళాశాల ప్రతినిధులు, జరుగుతున్న తతంగాన్ని వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాల అయ్యి ఉండి బాధ్యత లేని వ్యక్తి చేతిలో పిల్లల ప్రాణాలు పెట్టడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు.