జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ని ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో I FLY STATION ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక లో కార్యక్రమం జరిగింది. చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ , ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి దీపు పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరు అయ్యారు. వారిలో మురళీ మోహన్ , సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం అంటూ.. తన అన్నయ్యను వేదికపై పరిచయం చేశారు. తనను అన్నయ్య ఎంతో ప్రోత్సహించాడని గుర్తు చేసుకున్నారు. ఇక తన మిత్రులకు కూడా ధన్యవాదాలు అని చెప్పాడు. ప్రదీప్ గారు మీ రుణం నేను తీర్చుకోవాలి. మీకు సరస్వతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వేదికపై ఎన్నో వందల ఆడియోలు రిలీజ్ చేశాం. ఎవరు హీరో అంటే.. పాట హీరో.. సంగీతం హీరో… సాహిత్యం హీరో. నేను నా మొదటి పాటకు శ్రీలేఖ గారు అద్భతమైన బాణి ఇచ్చారు. అప్పుడు నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. అప్పుడు నన్ను రామానాయుడు గారు ఎంతో ప్రోత్సహించారు. 95లో మొదలైన నా ప్రయాణం… 2023 వరకు 28 సంవత్సరంలో 800 సినిమాల్లో 3600పైగా పాటలు రాశాను. నాకు నా జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చిన సంతవత్సరం 2023, ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్, రెండవదిహాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, మూడవది క్రిటిక్స్ అవార్డ్స్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాంబే హంగామా అవార్డు, ఆరవది జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాదిలో ఆరు అవార్డుల వర్షం కురిసింది.
తెలుగుకి వెయ్యి ఏళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాష చరిత్ర ఉంది. తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం… తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బతుకుతాం, తెలుగులో చనిపోతాం.. ఇక నాటు నాటు సాంగ్ రాసే అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఈ పాటను అలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గారికి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి ధన్యవాదాలు. నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాసినప్పటికీ.. దాన్ని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టింది. అంత సహనంగా ఉన్నందుకు ప్రతిఫలం దక్కింది. ప్రతి గాయకుడికి, ప్రతి దర్శకుడికి, ప్రతి సంగీత దర్శకుడికి ధన్యవాదాలు. మురళి మోహన్ గారు 83 ఏళ్లు శాశ్వత యువకులు. ఆయన హుషారుగా పాట వింటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చిన శాస్త్రి గారు.. మా ఇంటి ఎదురే ఉంటారు. ఆయన రావడం గొప్ప విశేషం. మీరందరూ లేకుండే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. భార్యని అర్థంగి అంటారు. నేను అర్ధంగి అనను పూర్ణంగి అంటాను. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం అయిన స్పాన్సార్స్ కు చేతులెత్తి నమస్కారం చేేస్తున్నాను.