Congress Party Sr Leader K. Jana Reddy Comments on Nagarajuna Sagar by Elections Results,TRS,CM KCR,Telangana News,Telangana Politics,
సాగర్ ఉప ఎన్నికల్లో నేను ప్రజా తీర్పును గౌరవిస్తున్నా: జానారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
ఓటర్లకు, ప్రజలకు ధన్యవాదాలు. 🙏
పోటీలో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థిని అభినందిస్తున్నా.
నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతపూర్వక అభినందనలు.
గెలుపు ఓటముల కంటే ఆశీర్వదించిన ఓటర్లకు ధన్యవాదాలు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల్లో ఆలోచన కలగడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావించింది.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చైర్ పర్సన్ సోనియా ఆలోచన మేరకు నా కర్తవ్యాన్ని నెరవేర్చుండుకు పోటీ చేశా.
కాంగ్రెస్ పార్టీ నాకిచ్చిన గౌరవంతోనే ఈ సమయంలో ఎన్నికల్లో బరిలో నిలుచున్న.
ధర్మం, ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం… పార్టీకి అండగా నిలిచేందుకు ఈ ఎన్నికల్లో పాల్గొన్న.
ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం అంతా సర్వం ఒడ్డినా… ఎన్నికల్లో నిలబడి సత్తా చాటింది.
ఈ ఎన్నికల్లో 47 % టిఆర్ఎస్, 37 % కాంగ్రెస్ కు ఓట్లు వచ్చాయి. తేడా 10%.
ఉపఎన్నిక అయినా ఓట్ల తేడా చాలా తక్కువే.
కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమి కోల్పోలేదు
6 శాతం ఓట్లు మారితే ప్రభుత్వాలే మారుతాయి.
నా కర్తవ్యం నేను నెరవేర్చాను
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులు ఇదే తరహాలో ముందుకుపోవాలి.
సామాజిక చైతన్యాన్ని కాపాడటానికి నేను పోటీలో ఉన్నా
విలువలతో కూడిన రాజకీయాలు రావాలి
ఇక ముందు కొంత కాలం విశ్రాంతి తీసుకుంటా
విశ్రాంత సమయంలో ఇక పై అన్ని విషయాలను అధ్యయనం చేస్తా