Corona Symptoms Dogs in Hyderabad Streets, Covid News, Corona News, Corona Vaccine,
COVID NEWS: హైదరాబాద్‌లో వీధికుక్కల్లో కరోనా లక్షణాలు… భయంతో హైదరాబాద్ ప్రజలు…
హైదరాబాద్‌లో వీధికుక్కల్లో కరోనా లక్షణాలు కలవరం పెడుతున్నాయి. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు సమీపంలో కుక్కలు నీరసంగా కనిపిస్తున్నాయి. శునకాలకు జ్వరం..దగ్గు.. జలుబు లక్షణాలు..ఉన్నాయి. రోడ్లపై పడిపోతూ.. నీరసంగా కనిపిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి కుక్కలు. దీంతో వాటిని చూసి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో వీధి కుక్కలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండంతో వారికి పరీక్షలు చేయించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. కొవిడ్ లక్షణాలు జంతువులలో కన్పించడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.
సుమారు నెల రోజుల కిందట హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లోని ఎనిమిది సింహాలలో కరోనా లక్షణాలు కన్పించడం అందరిని షాక్‌కు గురి చేసింది. దీంతో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) అధికారులు ఈ సింహాలకు నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ తేలడంతో జూపార్క్‌కు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు. తాజాగా నగరంలోని వీధి కుక్కలలో కోవిడ్ లక్షణాలు కన్పించడం ఇప్పుడు నగరవాసుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి.