Crime దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా హత్యలు మానభంగాలతో తెగ రెచ్చిపోతున్నారు హంతకులు తాజాగా రాజస్థాన్లో జరిగిన ఓ సంఘటన అందర్నీ షాక్కు గురిచేస్తుంది..
రాజస్థాన్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది ఉదయపూర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఓ జంట మృతదేహం కలకలం రేపింది.. ఉదయ్‌పూర్ సమీపంలోని ఉబేశ్వర్‌జీ అడవుల్లో శుక్రవారం ఓ యువకుడు, యువతి నగ్న మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్యానంతరం ఇద్దరినీ ఏదో రసాయనం పోసి కాల్చే ప్రయత్నం చేశారు హంతకులు.. యువకుడి ప్రైవేట్ పార్ట్ నరికివేయగా, బాలిక ప్రైవేట్ భాగంలో గాయాల గుర్తులు కనిపించాయి. అయితే ప్రేమ కారణంగానే వీరిద్దరిని చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు అయితే ఆ యువకునికి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆమె మాత్రం అవివాహిత అని తెలుస్తోంది.. ఆ యువకుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కూడా సమాచారం.. అయితే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. అసలు విషయం ఏంటనేది విచారణలో భాగంగా తెలియాల్సి ఉంది.. అయితే ఈ దారుణానికి పాల్పడిన వారు వీరి కుటుంబానికి చెందిన సభ్యుల లేక బయటవారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది..
దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తూ ఉంటే రోజురోజుకు భయం వేస్తుంది.. ఢిల్లీలో శ్రద్ధా హత్య కేసు విచారణ కొనసాగుతుండగా, పశ్చిమబెంగాల్‌లో మాజీ నేవీ ఉద్యోగి మర్డర్ కలకలం రేపింది. రోజుకో చోట ఏదో ఒక మూల జరుగుతున్న ఈ హత్యలతో దేశమంతా నివ్వెర పోతుంది..