CP Launches 4 Cabs Sponsored by Srinivasa Tours and Travels by Waving Flag
*4 క్యాబ్ లను జండా ఊపి ప్రారంభించిన సీపీ* Free of Cost
*క్యాబ్ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలి*
*ఈ సర్వీస్ కోవిడ్ బాధితుల కోసం కాదు, ఇతర అత్యవసర, అనారోగ్య సమస్యలున్న వారికోసం : రాచకొండ సీపీ మహేష్ భగవత్*
కోవిడ్ నైట్ కర్ఫ్యూ..రాత్రి 9 గంటల నుంచి 5 గంటల వరకు సమయంలో మెడికల్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని రాచకొండ కమిషనరేట్ లో నాలుగు క్యాబ్ లను ఈ రోజు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఎల్బీనగర్ క్యాంప్ లో ప్రారంభించారు. ఈ క్యాబ్స్ వనస్థలిపురం శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వారు అందుబాటు లో ఉంచారు. ఇవి ఎల్బీ నగర్, వనస్థలిపురం, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం పరిధిలో రాత్రి కర్ఫ్యూ సమయంలో వినియోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని సీనియర్ సిటీజన్స్, గర్భిణులు, అనారోగ్యంతో అత్యవసర వైద్య సాయం అవసరం ఉన్న మహిళలు ఉపయోగించుకోవచ్చునని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. దీని కోసం రాచకొండ కంట్రోల్ నెంబర్ 9490617234కు ఫోన్ చేస్తే సరిపోతుంది. గతములో కూడా ఇలాంటి సౌకర్యాలను రాచకొండ కమిషనరేట్ తరుపున ఏర్పాటు చేసామని సీపీ గుర్తు చేశారు. ఈ సర్వీస్ కోవిడ్ బాధితుల కోసం కాదు అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు, నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం ఈ వాహనాలు ఏర్పాటు చేశాము. ఎమర్జెన్సీ సమయంలో క్యాబ్ సర్వీసునకు సహకరించిన ట్రావెల్స్ ఎం డీ శ్రీనివాస్ రావు కి రాచకొండ కమిషనరేట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
*ఫ్రీ ఆఫ్ కాస్ట్*
మహేంద్ర తరుపున అంబులెన్స్ ని నెరడమేట్ లో ఏర్పాటు చేశామని, ఈ సర్వీస్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఆయన గుర్తు చేశారు. గతంలో లాస్ట్ రైడ్ సర్వీస్ పేరుతో కోవిడ్ తో చనిపోయిన వారికి అంబులెన్స్ లు ఉచితంగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
*ప్లాస్మా కావాలనుకునేవారు మా కంట్రోల్ రూమ్ కి సంప్రదించండి*
ప్లాస్మా కోసం కూడా మా కంట్రోల్ రూముకి 9490617234కి ఫోన్ చేయవచ్చునని రాచకొండ సీపీ గుర్తు చేశారు. మే 1st నుండి 18 సంవత్సరాల వాళ్లపై బడిన వారికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యువత అందరూ వ్యాక్సిన్ తీసుకొనే ముందు బ్లడ్ డోనేషన్ చేయాలని, ఎమర్జెన్సీ సమయంలో బ్లడ్ కొరత రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డోనేషన్ చేయాలని ఆయన కోరారు. త్వరలో రాచకొండ కమిషనరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ వారి అద్వర్యం బ్లడ్ డొనేషన్ కాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
*వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నాం*
రాచకొండ కమిషనరేట్ లో గత సంవత్సరం 1339 పోలీస్ సిబ్బంది కోవిడ్ బారినపడగా. ఈ సారి 300 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ బారిన పడ్డ సిబ్బంది కోలుకునే వరకు డ్రై ఫ్రూట్ ఇవ్వడం, వారి అకౌంట్ లో రూ 5000/- ఇవ్వడం జరుగుతుందని రాచకొండ సీపీ అన్నారు. ప్రతిసారి జూమ్ ద్వారా వైద్యులు వారి సమస్యలు తెలుసుకోవడం తద్వారా వారికి మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు నాలుగు వాహనాలు ఇస్తున్నామని రానున్న రోజుల్లో కూడా ఇంకా వాహనాలు ఇచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్ ట్రావెల్స్ ఎండీ శ్రీనివాస్ రావు అన్నారు. గత సంవత్సరంలో కోవిడ్ సమయంలో సదుపాయాన్ని దాదాపుగా 170 మంది ఉపయోగించుకోవడం జరిగిందని అన్నారు.
Take advantage of free cab service for Senior citizens , pregnant women having non covid emergency
This service is not for Covid victims but for those with other urgent and medical problems
Rachakonda CP Mahesh Bhagwat
Covid Night Curfew: Four cabs in L B Nagar zone & Chottupal Division of Bhongir zone of Rachakonda Commissionerate were launched today at the Rachakonda L B nagar Camp from 9 pm to 5 pm in view of the medical emergency. These cabs are made available by Vanasthalipuram Srinivasa Tours and Travel Agency. These can be used during night curfew from 9 pm to 5 am in LB Nagar, Vanasthalipuram, Chotupal and Ibrahimpatnam areas. Rachakonda CP Mahesh Bhagwat said the opportunity could be availed by senior citizens, pregnant women and women in need of emergency medical help. All you have to do is call the Rachakonda control number 9490617234. CP reminded that similar facilities have been set up on behalf of Rachakonda Commissionerate in the past as well. He clarified that this service is not for Covid victims. For diseases other than Covid, we have set up these vehicles for Non Covid Emergency Service. On behalf of the Rachakonda Commissionerate, I would like to thank Travels MD Srinivas Rao for his assistance to the cab service during the Emergency.
Free of cost
He recalled that free cab service alyte had been set up at Neradmat for Malkajigiri zone on behalf of Mahindra and the service is free of cost. Vehicle also provided free of cost to relatives of those who died with Covid under the name of Last Ride Service by feed the needy organization. Both these facilities can be availed by calling Rachakonda control room 9490617234.
Those who want plasma should contact our control room
You can also call our control room 9490617234 for plasma, Rachakonda CP reminded. He said the vaccine would be given to those over 18 years of age from May 1st. He urged all young people to donate blood before getting vaccinated and everyone should also donate blood to prevent blood shortage during emergencies. He said that soon the Indian Red Cross will organise a Blood Donation Camp at Rachakonda Commissionerate.
We give them courage
1339 police personnel were attacked by Covid in Rachakonda Commissionerate so far. This time more than 300 people are infected with the Covid. Rachakonda CP said that the staff affected by Covid will be given medical kit, dry fruits and Rs.5000 / – will be given in their account till they recover. Every time through the zoom the doctors are aware of their problems so that they are given morale support.
Srinivas Travels MD Srinivas Rao said that now they are giving away four vehicles and are ready to give and serve more vehicles in the coming days as well. He said the facility was used by about 170 people during the last year.