Health పెరుగు అంటేనే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పెరుగన్నం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు అయితే ఎంత మంచిదైనప్పటికీ దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని అంటున్నారు అవి ఏంటో తెలుసుకుందాం…
రోజు పెరుగన్నం తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు.. పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.. నిజానికి ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం పాలను అరిగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది పాలన చిన్న పిల్లలు మాత్రమే జీర్ణం చేసుకోగలుగుతారు పెద్దవాళ్లలో పాలు పెరుగుగా మారిన తర్వాత మాత్రమే జీర్ణం అవుతాయి అయితే అలాగే పెరుగు కూడా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందటానికి పెరుగు ప్రముఖ పాత్ర పోషిస్తుంది
అయితే కొందరు రాత్రిపూట కూడా పెరుగని తీసుకుంటూ ఉంటారు అయితే అందరూ కాకపోయినా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగుని తీసుకోకపోవడమే మంచిది.. జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగుని ఆహారంలో భాగం చేసుకోవద్దని తెలుస్తుంది అంతేకాకుండా అలర్జీతో బాధపడేవారు కూడా పెరుగును తీసుకోకపోవడం మంచిది.. అలాగే తప్పనిసరిగా పెరుగు తీసుకుని అలవాటు ఉన్నవారు పెరుగు ఒక బదులు మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకొని తీసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి..