Health ఏ వయసు వారేనా ఇష్టంగా తినే పండ్లలో సీతాఫలం ఒకటి ఇది రుచిగా కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.. దీనిలో సి-విటమిన్తోపాటు ఎ, బి, కె విటమిన్లూ, ప్రొటీన్లూ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు అంతేకాకుండా ఎన్నో అరకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు
సీతాఫలం సీజన్ వచ్చేసింది ఈ కాలంలో ఈ పళ్ళు విరివిరుగా లభిస్తాయి అందుకే ఎలాంటి వారైనా ఏ మాత్రం సంతోషం లేకుండా ఈ పళ్ళను తినొచ్చని అంటున్నారు నిపుణులు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో ఉండే విటమిన్ ఏ కంటికి సంబంధించిన ఎన్నో సమస్యలను దూరం చేస్తుందని తెలుస్తుంది అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు.. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోయి గుండెకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు వీటిలో సోడియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందని ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయని తెలుస్తుంది.. సీతాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడే వారికి ఇది చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ పళ్ళను ఎక్కువగా తీసుకోవచ్చు దీనివల్ల ఆహారం తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అవుతాయి.. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు పెరగాలి అనుకునే వాళ్లకు సీతాఫలం చక్కని పరిష్కారం వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తితో పాటు కావలసిన బరువు కూడా పెరుగుతారు.. అయితే వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే జలుబు అంటే సమస్యలు వచ్చే మాట నిజమే అయినప్పటికీ తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి..