Cyberabad Police, Corona 2nd Wave Locdown Rules, CP Sajjanar IPS, Covid News, Telangana Lockdown,
COVID NEWS: సాయంత్రం 6 గం. తర్వాత బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్, ఐపీఎస్
లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్,
అనవసరంగా బయటకు రావద్దు – లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి: సీపీ.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచుతూ ఆమోదం తెలపడంతో సాయంత్రం ఆరు గంటల వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ 30వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారు ఈరోజు హైటెక్ సిటీ సైబర్ టవర్, కూకట్ పల్లి జె.ఎన్.టి.యు చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ వద్ద తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ లో భాగంగా ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకే బయట తిరిగేందుకు అనుమతులు ఉంటాయన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రతీ ఒక్క షాప్, ఆఫీసులు సాయంత్రం ఆరు గంటల వరకు మూసివేయాలన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరైనా అనవసరంగా రోడ్ల పైన తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాసులు లేకుండా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీపీ గారి వెంట సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ఇన్ స్పెక్టర్ రవీంధ్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.