Cyberabad Police News, Cyberabad CP Shri VC Sajjanar, Cyber Crime News, Telangana News, Telugu World Now,
TELANGANA NEWS: *ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్.. బీ అలర్ట్*
*-అత్యాశకుపోకండి.. మోసపోకండి: సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్.,*
*-అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు*
సైబరాబాద్: మోసగాళ్లు మీ ఆశనే మీకు ఎరగా వేసి మిమ్మల్ని నిండా ముంచుతారు. నమ్మకం వెంటే మోసం ఉంటుంది. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ అర చేతిలో వైకుంఠం చూపిస్తారు. తీరా డబ్బులు డిపాజిట్ చేశాక ముఖం చాటేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త! అంటున్నారు.. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్.,
– ఫలానా కంపెనీలో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఇస్తాం, ఫలానా (xyz) షేర్లు కొంటే 10 రెట్ల లాభం, ల్యాండ్స్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వంటి ఆకర్షణీయ ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఈజీ మనీ కి అర్రులు చాచవద్దు. ఏదేని సంస్థలో పెట్టుబడు పెట్టాలనుకున్నప్పుడు లేదా షేర్ల కొనుగోలులో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆ కంపెనీ నిజంగా ఉందా, సదరు ప్రకటన ఎవరిచ్చారు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ టి కూడుకున్నవి. ఎవరూ మీకు ఊరికే లాభాలు ఇవ్వరని గమనించగలరు.
– ప్రముఖ కంపెనీలలో ఫ్రాంఛైజీ లలో పెట్టుబడులని ఫోన్ లు చేసి ఊరించి ముందుగా తమ ఖాతాలలో అందినంత డబ్బులు వేసుకుంటారు. ఆ తర్వాత ఫోన్ చేసినా సమాధానం కరువవుతుంది.
– సెల్ టవర్ల ఏర్పాటు, తక్కువ వడ్డీకి లోన్ లు ఇప్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఇలా దొరికితే.. అలా మోసాలు చేస్తారు. మోసగాళ్లు ఫోన్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగా బాధితుడిని అప్రోచ్ అవుతారు. వెంటనే వారి ఎత్తును పసిగడితే మోసపోకుండా ఉండొచ్చు.
– ఫోన్ చేసి మీకు ఫలానా లాటరీలో కోట్లు వచ్చి పడ్డాయి.. ప్రాసెసింగ్ ఫీ, కస్టమ్స్ తదితర వాటికి కొంత అమౌంట్ పంపించాలని ఎవరైనా చెబితే.. ఖచ్చితంగా మోసం అని గుర్తించండి. వారు దశలవారీగా మీ నుంచి డబ్బుని వసూలు చేస్తారు. ముందుగా మీ దేశంలో లాటరీ టికెట్ లు కొనే అనుమతి ఉందా? అసలు లాటరీ టికెట్ మీరు కొన్నారా? లేదా అని నిర్ధారించుకోండి. మీరు అసలు టికెటే కోనంది ఎవరు మీకు గిఫ్ట్ ఇవ్వరని గుర్తుంచుకోండి.
– అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం వంటి విషయాలను అడిగినప్పుడు.. ముందుగా అడిగే వారి క్రిడెన్షియల్స్/పూర్వాపరాలు చూడండి. అసలు మీరెవరు?, ఎందుకు ఫోన్ చేశారు? నా ఫోన్ నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నలు అడగండి. వారిచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేకున్నా.. వారి తడపడ్డా వారి కాల్ కట్ డిస్కనెక్ట్ చేయడం మంచిది.
– షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడుతుంటారు. మీ తరపున తాము షేర్ లను కొని ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తామని నమ్మించి మోసం చేస్తారు. అమెరికాకు చెందిన ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే ప్రతిరోజు డాలర్లతోపాటు ఏడాది తరువాత పెట్టిన పెట్టుబడి రెండింతలు వస్తుందని అమాయకులను ముంచుతారు.
– ‘గ్రీన్‌గోల్డ్ బయోటెక్’ పేరుతో కంపెనీ ప్రారంభించారు. పల్లీల నుంచి నూనె తీసి కంపెనీకి ఇవ్వాలి. నూనెతోపాటు పిప్పి కూడా కొనుగోలు చేస్తాం అని ప్రకటనలు ఇచ్చారు. కిలో నూనెకి రూ.100, పిప్పికి మరో 50 ఇస్తాం అని చెప్పారు. సగానికి సగం లాభం ఉంటుందని నమ్మించారు. లక్ష పెట్టుబడితో ఏడాదిలో రెండు లక్షల రూపాయలు సంపాదించొచ్చని ఆశపెట్టారు. 2 లక్షల పెడితే రెండేళ్లలో నాలుగు లక్షలు మీ సొంతం అవుతాయని ప్రకటనలు ఇచ్చారు. అంతే కాదు స్కీమ్ లో మరొకరిని చేర్పిస్తే 20 వేల రూపాయలు కమీషన్ ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. దీన్ని నమ్మిన ప్రజలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. కస్లమర్లను నమ్మించటానికి బాండ్ పేపర్లపై అగ్రిమెంట్లు కూడా రాసి ఇచ్చారు.
– మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. కరక్కాయ లు ఇస్తే వాటిని పొడి చేసి ఇస్తే రెట్టింపు డబ్బులు అని ప్రజలను మోసం చేశారు.
– తమ కంపెనీలో బంగారం లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలంటూ డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన కంపెనీలు ఉన్నాయి.
– బిట్‌కాయిన్ల పేరుతో మోసం చేస్తుంటారు. బిట్ కాయిన్ లు, క్రిప్టో కరెన్సీ మంచి ఇన్వెస్ట్ మెంట్ సాధనాలని నమ్మిస్తారు.
– ఫలానా భూమి పై (రియల్ ఎస్టేట్) పెట్టుబడి పెడితే సంవత్సరంలో రెట్టింపు లాభాలు వంటి ప్రకటనలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు.
– ఫ్రీ, ఆఫర్, డిస్కౌంట్ వంటి టెంప్టింగ్ పదాలలోని గూడార్థాన్ని ఆలోచించాలి.
– డబ్బులు ఊరికే రావు, కష్టపడాలి. ఈజీ మనీ కోసం ఆశపడి మోసపోకండి.
– మోసపూరిత ప్రకటనలు, కాల్స్ వస్తే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు 9490617310, సైబరాబాద్ వాట్సాప్ నంబర్ ఫోన్ నంబర్ 9490617444 లో ఫిర్యాదు చేయండి.