Dalitha Bandhu Scheme, CM KCR, Dr Errolla Srinivas, Telangana Poltical News, TS Government Schemes, Telugu World Now,
Telangana News: “దళిత బంధు”తో దళితుల “ఆత్మబంధువు” అయిన కేసీఆర్: డా. ఎర్రోళ్ల శ్రీనివాస్
అనేక సంవత్సరాలుగా అణచివేతకు గురి అవుతున్న దళిత జాతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం అంటే వారికి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా సహకరించడం మాత్రమే. తెలంగాణ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేసి సమాజంలో తలెత్తుకొని జీవించే విధంగా తీర్చి దిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా గొప్ప నాయకుడు. తెలంగాణలోని అణువు అణువు ఆకళింపు చేసుకున్న తెలంగాణ ప్రేమికుడు, తెలంగాణ ఎందుకు కావాలో వివరించి ఇటు ప్రజలను జాగృతులను చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప పోరాట యోధుడు కేసిఆర్.
తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా కావాలని కలలు కంటున్న స్వాప్నికుడు కేసీఆర్. అందుకే తెలంగాణ కేవలం వ్యవసాయ ప్రాంతం కనుక కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతుభీమా ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచి వారి జీవితాల్లో గొప్ప ఆర్థిక ప్రగతిని తీసుకొని వచ్చారు.
దళితులకు అండగా ఉంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ముందే చెప్పిన విధంగా 24 గంటలు గడవక ముందే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రి గ్రామం లో 76 కుటుంబాల ఖాతాల్లో పూర్తి జమను అందించిన మాట తప్పని నాయకుడు సీఎం కేసిఆర్. దళిత బంధు ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాడు అనడానికి ఇవాళ వాసాల మర్రి గ్రామమే నిదర్శనం.
ఆసరా పెన్షన్ తో ఆపద్బాంధవుడు అయ్యాడు, రైతు రైతు బంధు తో రైతన్నల గుండెల్లో గూడు కట్టుకున్నాడు, దళిత బంధు తో దళిత జాతిలో వెలుగులు నింపాడు మన సీఎం కేసీఆర్.
కల్యాణ లక్ష్మీ పథకం తో పేద ఆడబిడ్డలకు పెద్ద అన్న అయ్యాడు.
దళిత బంధుతో దళితుల ఆత్మబంధువు అయ్యాడు మన సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర దళిత సమాజం దళిత బంధు పథకానికి ఊరు, వాడ స్వాగతం పలుకుతోంది. తమ బతుకులలో కొత్త వెలుగులు నింపిన ఈ పథకం తెలంగాణ దళిత కుటుంబాల్లో చీకటిని పారద్రోలి వెలుగులు విరజిమ్మి బంగారు తెలంగాణ దళిత వాడల్లో వికసించాలని కోరుకుంటు యావత్ తెలంగాణ దళిత సమాజం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమాజ స్ఫూర్తికి, ఆయన దృఢ సంకల్పానికి, చిత్తశుద్ధికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
డా. ఎర్రోళ్ల శ్రీనివాస్