Crime రోజు రోజుకు ఈ ఆస్పత్రిలో మరి విర్రవీగిపోతున్నాయి.. వీరి నిర్లక్ష్యంతో ఇప్పటికే ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న వీరి ప్రవర్తన మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు తాజాగా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం చోటు చేసుకుంది.. అక్కడికి వచ్చిన రోగికి రక్తానికి బదులు బత్తాయి చూసినా ఎక్కించడంతో ఆ రోగి చనిపోయాడు ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.. డెంగ్యూ జ్వరంతో 35 ఏళ్ల ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజులో ఉన్న ఆస్పత్రిలో చేరాడు అయితే అతనికి ప్లేట్లెట్స్ పడిపోవడంతో అక్కడ సిబ్బంది ప్లేట్ లైట్స్ ఎక్కిస్తున్నామని చెప్పి బత్తాయి రసాన్ని ఎక్కించారు అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించింది దాంతో ఆసుపత్రి సిబ్బంది చేతులెత్తేసారు చేసేదేమీ లేక ఆ వ్యక్తి బంధువులు అతన్ని మరొక ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది ఇంతలో ఆ వ్యక్తి మరణించాడు.. అయితే ఈ విషయంపై రోగి బంధువులు ధర్నా చేయగా విషయం పోలీసుల వరకు వెళ్ళింది అయితే దీనిపై విచారణ జరిపించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి.. అనధికారంగా ఆసుపత్రిని నిర్మించారని అంతేకాకుండా ఇప్పటికే ఎందరో రోగుల ప్రాణాలతో చెలగాటలాడారని తెలుసుకున్న ప్రయాగ్ రాజ్ పోలీసులు ఆసుపత్రిని బోల్డోజర్‌తో కూల్చేసేందుకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌కు ప్రయాగ్‌రాజ్ పురపాలక సంఘం అధికారులు ఇచ్చిన కూల్చివేత నోటీసులో.. ఈ హాస్సిటల్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించారని, ఖాళీ చేయాలంటూ కొన్ని నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని తెలిపింది.