Sai Kabir : : టాలీవుడ్(Tollywood), బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమలలో అప్పుడప్పుడు డ్రగ్స్(Drugs) టాపిక్ వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాత KP చౌదరి వ్యవహారంలో డ్రగ్స్ కేసు నడుస్తుంది. ఇందులో పలువురు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ టాపిక్ వైరల్ అవుతుంది. ఓ డైరెక్టర్(Director) డ్రగ్స్ అడిక్ట్ అవ్వడంతో సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల ముందు రిహాబిటేషన్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు.
కంగనా రనౌత్ నిర్మాణంలో నవాజుద్దీన్ సిద్ధికి, అవనీత్ కౌర్ నటించిన సినిమా టీకు వెడ్స్ షేరు. ఈ సినిమాకి సాయి కబీర్ దర్శకత్వం వహించాడు. సాయి కబీర్ గతంలో పలు సినిమాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేశాడు. కంగనా రనౌత్ నటించిన రివాల్వర్ రాణి సినిమాని సాయి కబీర్ తెరకెక్కించాడు. టీకు వెడ్స్ షేరు సినిమా ప్రమోషన్స్ లో సాయి కబీర్ కనిపించలేదు. సినిమాలో నటించిన వాళ్ళతో పాటు కంగనా మాత్రం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంద
అయితే సాయి కబీర్ కి డ్రగ్స్ అలవాటు ఉందని, గతంలో డ్రగ్స్ తీసుకున్నాడని, సినిమా తీసిన తర్వాత కూడా డ్రగ్స్ తీసుకున్నాడని సమాచారం. డ్రగ్స్ కి ఎక్కువగా అడిక్ట్ అవ్వడంతో సినిమా రిలిజ్ కి ముందు రిహాబిటేషన్ సెంటర్ లో చేరాడని సమాచారం. ప్రస్తుతం ఆ అడిక్ట్ నుంచి బయటపడుతున్నట్టు, ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమా రిలీజ్ కి ముందు డ్రగ్స్ కి అడిక్ట్ అయి రిహాబిటేషన్ సెంటర్ లో చేరడంతో డైరెక్టర్ సాయి కబీర్ ప్రస్తుతం వైరల్ గా మారాడు.