RRR Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా RRR. గత ఏడాది మార్చి 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసి రూ.1100 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు సినిమాకే కాదు..ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచింది. అందుకు కారణం ఆస్కార్ అవార్డ్‌ను సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇలా ఎన్న అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ సినిమా యూనిట్‌కు మరో అరుదైన ఘనత దక్కింది. అదేంటంటే.. ప్రెస్టీజియస్‌గా భావించే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ కమిటీలో RRR టీమ్ నుంచి 6గురుకి చోటు దక్కటం విశేషం. ఆస్కార్ అవార్డులను అందించే ఈ కమిటీ 398 మంది కొత్త సభ్యులకు తమ కమిటీలో చోటు కల్పించింది. అందులో RRR టీమ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు సిరిల్‌లకు స్థానం దక్కింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఆస్కార్ కమిటీలో 10వేల మంది సభ్యులున్నారు. తాజాగా 398 చేరటంతో 10,817 మంది సభ్యులయ్యారు. 96వ అకాడమీ అవార్డ్స్ వేడుకను వచ్చే ఏడాది మార్చి 10న నిర్వహించబోతున్నారు.
RRR టీమ్‌లో అరుగురు సభ్యులతో పాటు కోలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు కూడా ఈ కమిటీలో చోటు దక్కింది. ఈ విషయంపై ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం రాక ముందునాటి పరిస్థితులపై రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR.