Singer Mangli : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రైవేట్ సాంగ్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది మంగ్లీ. ఇక సినిమాల్లో అదరగొట్టే పాటలతో మంచి పేరు తెచ్చుకొని స్టార్ గా ఎదిగింది. తక్కువ టైంలోనే ఇప్పటికే దాదాపు 100కి పైగా సాంగ్స్ పాడింది మంగ్లీ. మంగ్లీ పాటలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నటిగా కూడా పలు సినిమాలు చేసింది.
మంగ్లీ ప్రతి పండగకు ఒక ప్రైవేట్ సాంగ్ పాడి స్పెషల్ వీడియో షూట్ చేయించి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా బోనాలపై ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తుంది. ఈ షూటింగ్ సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి గాయం అయిందని సమాచారం. దీంతో యూనిట్ వెంటనే మంగ్లీని హాస్పిటల్ కి తరలించారు.
వైద్యులు చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారని, మంగ్లీని కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని తెలిపినట్టు సమాచారం. దీంతో ఆమె అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మళ్ళీ సరికొత్త పాటలతో ప్రేక్షకులను అలరించాలి అని పలువురు సెలబ్రిటీలు ఆశిస్తున్నారు . మంగ్లీ కి ఇలా గాయం అవ్వడం ఎంతో భాదకరం అని సన్నిహితులు ,స్నేహితులు బాదపడ్డారు . ప్రేక్షకుల అభిమానం వల్లే చిన్న గాయం తో బయటపడ్డాను. మీ అభిమానం ఎప్పుడు నాపై ఇలానే వుండాలి అని కోరుకున్నారు మంగ్లీ.మీ అభిమానం వల్లే ఇంత స్తాయికి వచ్చాను అని చెప్పారు . కొద్ది రోజులు రెస్ట్ తరువాత మళ్ళీ తన ఘాట్ కి వెళ్ళవచ్చు అని వైద్యులుచెప్పారు .