Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. తమిళంతో సమానంగా తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే సూర్య పై తెలుగు ఫ్యాన్స్ చూపించే అభిమానం తమిళ్ ఫ్యాన్స్ కూడా చూపించారు ఏమో అనిపిస్తుంది.. ఇక్కడి అభిమానులు చేసే కొన్ని పనులు చూస్తే. సూర్య సినిమాల రిలీజ్ నే ఓ రేంజ్ లో నిర్వహించే టాలీవుడ్ ఆడియన్స్.. తాజాగా ఈ హీరో బర్త్ డేని మరో స్థాయిలో చేశారు. ఇక్కడి స్టార్ హీరోలు పవన్, మహేష్ మరియు ఇతర స్టార్స్ పుట్టినరోజు వేడుకలకు బైక్ ర్యాలీలు చేస్తూ అభిమానులు సందడి చేస్తుంటారు.
ఇదే నేపథ్యంలోనే సూర్య బర్త్ డేని కూడా నిర్వహించారు టాలీవుడ్ అభిమానులు. ఆంధ్రప్రదేశ్ లోని కైకలూరులో దాదాపు 1500 పైగా బైక్స్‌తో ర్యాలీ నిర్వహించి సూర్య పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కైకలూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సూర్య బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సూర్య కంటే తెలుగులో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న రజినీకాంత్ అండ్ కమల్ హాసన్ కి కూడా ఈ రేంజ్ అభిమానం సొంతం కాలేదు.
కాగా ఇదే పుట్టినరోజు వేడుకల్లో ఒక విషాదం చోటు చేసుకుంది. సూర్య బర్త్ డే బ్యానర్స్ కడుతూ కరెంటు షాక్ తగిలి మరణించారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకి చెందిన ముగ్గురు డిగ్రీ విద్యార్థులు ఈ ప్రమాదానికి గురి కాగా ఇద్దరు అక్కడక్కడే మరణించగా మరో అభిమాని మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య బాధిత కుటుంబాలను ఫోన్ చేసి పరామర్శించాడు. అలాగే ఆ కుటుంబాలకి తాను తోడుగా ఉంటానని కూడా సూర్య మాటిచ్చాడు.