Dreams : సాధారణంగా అందరికీ కలలు వస్తూనే ఉంటాయి. వ్యక్తి తన కలలను ఉదయం నిద్రలేచాక మరచిపోతాడు. కానీ కొన్నిసార్లు కొన్ని కలలు ఆ వ్యక్తిని రోజంతా వెంటాడుతూనే ఉంటాయి. చాలా సార్లు కలల అర్థం తెలియక, వ్యక్తి కలలను విస్మరిస్తాడు. కలలు ఒక వ్యక్తి భవిష్యత్తు సంఘటనల సూచనను కూడా ఇస్తాయి అని అంటున్నారు. వాస్తు జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కలలో కొన్ని వస్తువులు రావడం అంత మంచిది కాదని అంటున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
హిందూ మతంలో చీపురు లక్ష్మీ దేవి రూపంగా చెప్పబడింది . కానీ కలలో మాత్రమే చీపురు చూడటం శ్రేయస్కరం కాదని అంటున్నారు. చీపురు నేలపై పడి ఉంటే, అది అశుభ సంకేతం అని చెబుతారు. నేలపై పడి ఉన్న చీపురు చూస్తే లక్ష్మీదేవి అవమానానికి గురవుతోందని అర్థం. అలానే కలలో తలుపు వెనుక ఉంచిన చీపురు అశుభమైనదిగా పరిగణించబడుతుంది . దీని అర్థం మీరు చేయబోయే కొన్ని పనులు తప్పు కావచ్చు. కొత్త ఉద్యోగం ప్రారంభిస్తే ఆ ఉద్యోగాన్ని అక్కడే వదిలేయడం మంచిది అని సూచిస్తున్నారు.
అలానే కలలో ఎవరైనా తుడుచుకోవడం చూస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల మీరు త్వరలో ధనవంతులు అవుతారని అంచనా వేస్తుంది. అంతే కాదు మీ కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి. కలలో చీపురు కొనడం చూసినా మంచిదే. ఈ కల మీరు చేయబోయే పనిలో త్వరలో విజయం సాధిస్తుందని సూచిస్తుంది. అలానే కొన్ని రకాల వస్తువులు కలలో రావడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.