Director Teja:సరి కొత్త రీతిలో వుండే ప్రేమ కథా చిత్రాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తేజ ప్రస్తుతం చిత్రీకరించిన చిత్రం అయిన ‘అహింస’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు ఆయన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. దానికి సంబంధిత వివరాలను రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు తేజ.
డైరెక్టర్ తేజ (Director Teja) రూపొందించిన లవ్ స్టోరీలు టాలీవుడ్‌లో సృష్టించిన ట్రెండ్ అంతా ఇంత కాదు ధాని గురించి తెలియంది కాదు. ప్రత్యేకించి ‘చిత్రం, నువ్వు నేను, ‘జయం’ చిత్రాలు తనను స్టార్ డైరెక్టర్‌ను చేశాయి. కానీ అదే పనిలో వరుస చిత్రాలు నిర్మించి వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకున్న తేజ.. చాలా ఏళ్ల తర్వాత రానా హీరోగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీతో హిట్ కొట్టాడు. మళ్లీ ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్‌ను (Abhiram Daggubati) హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ (Ahimsa) చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ త్వరలోనే రానుండగా.. ఇప్పుడు తేజ కొడుకు అమితవ్ తేజ (Amitov Teja) హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే వార్తపై తాజాగా స్పందించిన ఈ సీనియర్ డైరెక్టర్.. అమితవ్ డెబ్యూపై (Amitov Debut as Hero ) ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.
‘మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నా. ఫారిస్ లో అందుకు సంబంధించిన కోర్సులు చేసొచ్చాడు. హ్యాండ్స్‌మ్‌గానే ఉంటాడు కానీ హీరోగా కావాలంటే అదొక్కటే సరిపోదు కదా. అలాగే తన డెబ్యూ మూవీని నేను డైరెక్టర్ చేయాలా? ఇంకెవరికైనా అప్పగించాలా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు’ అన్నారు తేజ’.ఇంకో డైరెక్టర్ కి అప్పగించాలనే ఆలోచనలో వున్న అన్నారు’ తేజ.