Divi Vadthya Is The Winner Of The Hyderabad Times Most Desirable Woman On TV 2020, Bigg Boss4 Telugu, Film News,
FILM NEWS: హైదరాబాద్ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ 2020` విన్నర్‌గా “దివి వథ్య”
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయినటువంటి దివి వథ్య అదే షో ద్వారా మెగాస్టార్ చిరంజీవి దృష్టిని కూడా ఆకర్షించింది. తాజాగా దివి వథ్య హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ 2020 విన్నర్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ “తాను ఇంతవరకు కలలో కూడా హైదరాబాద్ టైమ్స్ డిజైరబుల్ ఉమెన్ గా విన్నర్ అవుతానని ఎక్సపెక్ట్ చేయలేదు. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను అని తన సంతోషాన్ని వ్యక్తంచేసింది. అలాగే “మిమ్మల్ని దేని గురించి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ప్రేక్షకులు ఎంచుకున్నారని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు …నా అందం కంటే ఎక్కువగా జనాలు నా క్యారెక్టర్ ఇష్టపడతారు. నన్ను బ్యూటీ విత్ బ్రెయిన్ అని భావించారని నేను అనుకుంటున్నాను. అందం కాలంతో పాటు మారిపోతుంది. కానీ తెలివి ఎల్లప్పుడూ మన తోనే ఉంటుంది. కాబట్టి నేను ఎల్లప్పుడూ మరింత తెలివిగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను అని సమాధానం చెప్పింది.
అలాగే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా విజేతను చేసింది కాబట్టి ఇకపై మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. దివికి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మంచి అవకాశం లభించింది. రీసెంట్‌గా దివి స్పార్క్ ఓటిటి వారు రూపొందించిన ‘క్యాబ్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే `లంబసింగి` షూటింగ్ పూర్తయ్యింది. వీటితోపాటు ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలిపింది.