ప్రస్తుతం అందం మత్తలో ప్రతి ఒక్కరూ ఊగుతున్నారు. దీని కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ముఖ అందంలో ముందుగా చూసుకునేది కను బొమ్మలు. ముఖ సౌందర్యాన్ని ప్రదర్శించడంలో కనుబొమ్మల పాత్ర కీలకమైంది. అసలు కనుబొమ్మ లేకుండా ముఖాన్ని ఊహించుకోలేము. ఇవే అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటాయి. వీటిని అందంగా చూపుకోవడం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. వెంట్రుకలు పలుచగా ఉన్నా, మందంగా ఉన్నా కనుబొమ్మలు మంచిగా ఉండాలనేది అందరి కోరిక.
మేకప్ వేసుకునే వారైతే, మరింత మెరుగ్గా కనిపించేలా రాయవచ్చు. కానీ మేకప్ అలవాటు లేనివాళ్ల పరిస్థితి ఏంటి? అంతేకాదు చాలా మందికి కనుబొమ్మలు పలుచగా, తక్కువగా ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కనుబొమ్మలు పలుచగానే ఉంటాయి. ఈ కనుబొమ్మలను కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. కనుబొమ్మలను ఒత్తుగా పెంచే వంటింటి చిట్కాలు ఏమిటి.. ఈ చిట్కాలను ఎలా వాడాలి.. అన్న వివరాలను తెలుసుకోండి.
ఆముదం.. ఇది మనందరికీ తెలిసిందే. ఆముదం చిక్కగా ఉంటుంది. ప్రస్తుతం ఇళ్లలో లభించడం కష్టం. అయినా కనుబొమ్మల కోసం వాడక తప్పదు. ఆముదం నూనెలో దూదిని ముంచి రోజూ రాత్రి పడుకునే ముందు కనుబొమ్మల మీద రాయాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆముదంలో ఉండే పోషకాలు కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. ఇలా క్రమం తప్పకుంగా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. అంతేకాకుండా ఆముదంలో ఉండే పోషకాలు చర్మానికి కాంతిని కూడా ఇస్తాయి. ఇలా ప్రతిరోజూ ఈ ఆముదం చిట్కాపాటిస్తే కనుబొమ్మలు పలుచగా ఉండేవాళ్లు, తక్కువగా ఉన్నవాళ్లు ప్రయోజనం పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ రాత్రి నుండి చిట్కా మొదలుపెట్టండి.