బండి సంజయ్ మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం. ఢిల్లీలో ఆయన్ని దేకెటోడు లేడు. రైతన్నా మోసపోవద్దు. మీరు మంచిగుండాలె. క్షేమంగా ఉండాలె. మతిలేని వాళ్ల మాటలు, రాజకీయాల కోసం సొల్లు కార్చేటోళ్ల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దనేదే నా తపన. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతు బతుకు తెల్లవడుతున్నది. ప్రభుత్వం ఆదుకుంటదనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం కోల్పోకుండా, ఆర్థిక పరిస్థితి దిగజారిపోవద్దనే ఇతర పంటలు వేయాలని కోరుతున్నం. మీ బిడ్డగా చెప్తున్నా. ఈ పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే అయితది.
యువజనులారా.. మోసపోవద్దు: నిరుద్యోగ యువత బీజేపీ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. మోసం చేయాలని భావించడం లేదు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం ఎంప్లాయిమెంట్ క్యాలెండర్‌ను డిక్లేర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండు మూడురోజుల్లో సమావేశం అనంతరం నోటిఫికేషన్లు రానున్నాయి.
దళితబంధుకు 20 వేల కోట్లు: దళితబంధు అమలుపై సన్నాసుల మాటలు పట్టించుకోవద్దు. హుజూరాబాద్, మరో నాలుగు మండలాల్లో దళితబంధు అమలవుతున్నది. మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా వంద కుటుంబాల చొప్పున దళితబంధు అమలు చేస్తాం. దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు పెడుతాం. 2023 నాటికి కనీసం 5-6 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
బీజేపీ దగ్గర రెండు స్టాంపులుంటయి.. ఒకటి దేశద్రోహులు, రెండు అర్బన్ నక్సలైట్లు: బీజేపీ ఏమన్నా దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీనా ముద్రలేసేందుకు?
నీకు అక్కరకొచ్చినప్పుడు నీ బిల్లులకు మద్దతిచ్చినప్పుడు నేను దేశభక్తుణ్ని. నీ తప్పుల్ని ప్రశ్నిస్తే తెల్లారేసరికి నేను దేశద్రోహిని. అంతేకదా!
సంజయ్, నీకు అర్థంకాని ఉర్దూలోనో, ఇంగ్లిషులోనో మాట్లాడుతలేను కదా. తెలుగులోనే కదా అడుగుతున్న. వడ్లు కొంటరా? లేదా? చెప్పు!
సంక్షేమ పథకాలు నీ ఇంట్లకెల్లి ఇస్తున్నవా అంటున్నవ్. మరి కేంద్ర నిధులు నీ ఇంట్లకెల్లి ఇస్తున్నవా? దేశ ఖజానా నీ అయ్య సొత్తు కాదు, అది ప్రజల సొత్తు!
నేను మందు తాగుతా అంటున్నవ్. నీకు తెలుసా నేను మందు తాగేది. నువ్వు వచ్చి నాకు మందు కలిపినవా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ గురువులు నీకు నేర్పింది?
ఫామ్ హౌస్ కాదది; ఫార్మర్స్ హౌస్. అది నా ఇల్లు. నా నియోజకవర్గం. ఫామ్ హౌస్ దున్నుతా అంటవ్.. నువ్వేమన్న ట్రాక్టర్ డ్రైవర్‌వా సంజయ్.. !
మా సంగతి సరే, మరి మీరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ జ్యోతిరాదిత్య సింధియాను ఎందుకు చేర్చుకున్నరు? ఆయనది ఆరెస్సెసా? బీజేపా? మనం చేస్తే సంసారం. మంది చేస్తే వ్యభిచారం అంటరా?
ప్రాజెక్టులు కట్టకపోతే కట్టలేదంటరు. కడితే కమీషన్లంటరు. దేశవ్యాప్తంగా కడుతున్న ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే కడుతున్నరా?
ప్రజలు నన్ను నమ్మడం లేదంటున్నావ్. మరి నిన్ను నమ్ముతున్నారా? నిన్ను నమ్మడం వల్లేనా.. 107 సీట్లలో బీజేపీకి డిపాజిట్లు పోయినయ్!
చీ చీ అదో దిక్కుమాలిన పార్టీ. కాంగ్రెస్ దేశంలో ఖతమై పోయింది. ఎవరో కొందరు దానిని బతి కించాలని చూస్తున్నారు. కానీ అది బతకదు. ఎన్ని జాకీలు పెట్టినా లేవదు. అది అయ్యే పనికాదు.
తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడున్ననో తర్వాత సంగతి. ముందు నువ్వెక్కడున్నవో చెప్పు. తెలంగాణకు, నువ్వు, నీ పార్టీ ఏం చేసింరో చెప్పు!
నిరుపేదల కోసం: మేం సంక్షేమ పథకాలు పెడితే, ప్రజలను సోమరిపోతులం చేస్తున్నామంటారా?
ఇదేనా మీ పార్టీ విధానం.
పెట్రో ధరలు ఎక్కువున్నాయని ప్రజలు మొత్తుకుంటుంటే.. అయితే అఫ్ఘానిస్థాన్‌కో, పాకిస్థాన్‌కో పొండి అంటరా? ఇదేనా రీతి?
నాకేం కంపెనీలు లేవు. బాజాప్తా, బేజాప్తా ట్యాక్సులు కడుతున్న. మీలాగా నేను రఫేల్ విమానాల కొనుగోల్లో కమీషన్లు తీసుకోలేదు. సూట్‌కేసులు మోయలేదు.
దళిత బంధు గురించి మాట్లాడే తెలివుందా నీ మొకానికి. భారతదేశ చరిత్రలో దళితులకు లైసెన్సుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఈడీ, ఐటీ సోదాలకు దొంగలైతే భయపడతరు. మేమెందుకు భయపడతం!
నేషనల్ హైవేలు ఇచ్చినం అంటవా? ఎందుకియ్యవ్. ఇవ్వడం కేంద్రం విధి. ఇవ్వకపోతే కేంద్రం పీకనీకి ఉందా?
కేంద్రం అట్టర్‌ఫ్లాప్. ఫసల్ బీమా లేదు. మన్ను బీమా లేదు. రైతుల మందు బీజేపీని పంచ్‌నామా చేసి చూపిస్తం, మా దెబ్బకు గింగిరాలు తిరిగి కొట్టుకోవాలి.
ఇక్కడ శానా ఇసిత్రాలున్నయి.
ముఖ్యమంత్రులు దేశం దాటి
బయటకు పోవాలన్నా కేంద్రం
పర్మిషన్ కావాలి. మొన్న మమతా బెనర్జీ సంగతి చూసింరు కదా!
కాంగ్రెసా? శీ..శీ.. శీ.. శీ.. అదేం పార్టీ? రీచార్జి పెట్టినా ఎక్కదు.
గుళ్లు తిరుగుతం, గోపురాలు
తిరుగుతం, గుండ్లు గీసుకుంటం,
తిరుపతి పోతం, శ్రీరంగం పోతం
మిస్టర్ బండి సంజయ్, ఒళ్లు దగ్గరపెట్టుకో, ఇక్కడ చెంగడబింగడ ఎగురుతా అంటే కుదరదు.
నేను పార్టీని సృష్టించిన, జెండాను సృష్టించిన, రాష్ర్టాన్ని సృష్టించిన, నీలాంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేక
మందిని సృష్టించిన. నువ్వా నన్ను అనేది?
మంచిగ నడిచే ఎల్‌ఐసీని ఎందుకు ప్రైవేటుపరం చేయాలె. ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉంటే రిజర్వేషన్లు ఉంటయ్. ప్రైవేటు చేస్తే రిజర్వేషన్లు పోతయ్.
గొర్ల పథకానికి కేంద్రం నిధులిస్తే,
మరి పక్కన కర్ణాటకలో, అక్కడ
మధ్యప్రదేశ్‌లో, ఒక్క బీజేపీ పాలిత
రాష్ట్రంలోనైనా అదెందుకు లేదు?
నేను చైనాలో డబ్బును దాచుకున్నానట. పోయిపోయి చైనాలో!
ఫెడరల్ ఫ్రంట్ కావాల్నా
నీకు అర్జంటుగ. తెమ్మంటవా?
ఎక్స్‌పైరీ అయిన మెడిసిన్‌లాగా
ఎప్పటికీ అదే పాట.. దళితుడిని
సీఎం చేయలేదని!
తెలంగాణ నుంచి మోదీ ఏడు
మండలాలు, సీలేరు విద్యుత్కేంద్రం గుంజుకున్నప్పుడు, ఈ బీజేపీ ఎంపీలు ఎక్కడున్నరు? ఎక్కడ పన్నరు?
హనుమంతుని గుడి లేని ఊరు, మా సంక్షేమ పథకం అందని ఇల్లు తెలంగాణలో లేదు. చివరికి నీ (సంజయ్) ఇంటికి కూడా భగీరథ నీళ్లొస్తున్నయ్!