Health నిత్య జీవితంలో స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు చేసే పనులలో స్నానం కూడా ఒకటి. దీన్ని కేవలం ఒంటిని శుభ్రం చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మనసును ప్రశాంతంగా ఉంచేదిగా కూడా చూడాలి.. ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్న.. మానసికంగా ప్రశాంతత లేకపోయినా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే తెలియని అలసట మాయమవుతుంది. అలాంటి స్నానం విషయంలో ఈ తప్పులు మాత్రం చేయకూడదు..
చాలామంది వర్క్ అవుట్ చేసి వచ్చిన వెంటనే చెమటగా ఉందని స్నానం చేస్తూ ఉంటారు. అయితే శారీరిక శ్రమ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే స్నానం చేయకూడదు.. కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత స్నానం చేయడం ఉత్తమం.. ఉదయం పూట చన్నీటి స్నానం చేయడం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇదే స్నానం రాత్రి పడుకునే ముందు మాత్రం చల్లనీటితో చేయరాదు. ఇలా చేస్తే నిద్రలేని సమస్యతో బాధపడాల్సి వస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది..
అలాగే ప్రతిరోజు తలస్నానం చేయడం కూడా అంత మంచి విషయం కాదు. దీనివలన జుట్టులో సహజంగా ఉండే తేమ గుణాలు పోయి జుట్టు పొడి మారిపోతుంది. వారానికి రెండు సార్లు గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయడం ఉత్తమం.. తరచూ స్నానానికి వాడే షవర్ ను శుభ్రం చేయకపోవడం, బాత్ టబ్బును ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల ఎన్నో రకాల చర్మవ్యాధులు వస్తూ ఉంటాయి. స్నానం చేశాక ఉపయోగించే టవల్లను ప్రతిరోజు ఎండలో వేయాలి. అలాగే రెండు మూడు రోజులకు ఒకసారి తప్పకుండా ఉతకటం మంచిది.