Dr Ravinder Reddy Parige, Medicover Hospitals, Covid 3rd Wave News, CP Sajjanaar IPS, Corona Vaccine,
HEALTH NEWS: కోవిడ్ 3rd వేవ్ అవగాహన బుక్లెట్ విడుదల చేసిన మెడికవర్ హాస్పిటల్స్
*సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి .పి సజ్జనార్ గారు చేతుల మీదుగా కోవిడ్ మూడవ వేవ్ అవగాహన బుక్లెట్ విడుదల చేసిన మెడికవర్ హాస్పిటల్స్*
కరోనా మూడవ వేవ్ గురించిన సంక్షిప్త సమాచారాన్ని పొందుపరిచినా బుక్లెట్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి .పి సజ్జనార్ గారు విడుదల చేసారు .
మూడవ వేవ్ లో కరోనా ఎలాంటి వ్యక్తులపైనా ప్రభావం చూపుతుంది , పిల్లలను కోవిడ్ బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి , ఒకవేళ కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే అన్ని రకాల అంశాలను క్లుప్తంగా ఈ బుక్లెట్ లో పొందుపరిచారు .
మూడవ వేవ్ లో అత్యధికంగా చిన్న పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ అని అన్ని సర్వేలు తెలుపుతున్న నేపథ్యంలో మనం అందరం అత్యంత జాగ్రత్త వహించాలి . ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువ ఉన్న పిల్లలలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది .
పిల్లల కు పౌష్టికాహారం అందించడం ద్వారా వారికి రోగనిరోధకశక్తి పెరిగి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలరు .
పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధ వహించాలి . మూడవ వేవ్ పొంచిఉన్న నేపథ్యంలో పిల్లలు అన్నిరకాల వైద్య సేవలనందించడానికి మెడికవర్ హాస్పిటల్స్ పీడియాట్రిక్ అండ్ నియోనాటాలజీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉంది . అన్నిరకాల ఎమర్జెన్సీ ,నాన్ ఎమర్జెన్సీ సేవలని అందుబాటులో ఉంచుతున్నాము .ఈ తరుణం లో మా మెడికల్ , నర్సింగ్, విద్య సిబ్బంది పూర్తి నిబద్దతతో వ్యవహరిస్తున్నారు అని సీనియర్ పీడీయాట్రిక్ అండ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె అన్నారు
ఈ కార్యక్రమం లో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ ,సీనియర్ పీడీయాట్రిక్ అండ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె ,ఎస్ సి ఎస్ సి సెక్రటరీ కృష్ణ ఏదుల , సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి , మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ ,చీఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ పాల్గొన్నారు .
ఈ బుక్లెట్ ను మెడికవర్ హాస్పిటల్స్ వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు . మరిన్ని వివరాలకు www.medicoverhospitals.in కు లాగిన్ అవ్వండి.
https://youtu.be/X4iyE253zFM