Movie దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ నటించిన ‘సీతారామం’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఘనవిజయం అందుకోవటంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లని సాధించింది.. హిందీలో కూడా మంచి విజయం రావడంతో అక్కడ సీతారామం మూవీకి విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు వచ్చిన దుల్కర్ సల్మాన్ షారుక్ ఖాన్ కోసం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ఈ సభలో దుల్కర్ సల్మాన్.. షారుఖ్ ఖాన్ ను పొగడ్తల్లో ముంచేత్తారు. ఆయన ఒక లెజెండ్ యాక్టర్ అని.. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగానని.. తనతో నన్ను పోల్చొద్దని రిక్వెస్ట్ చేశారు..
“నేను షారుక్ ఖాన్ కు పెద్ద అభిమానిని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నాలాంటి ఎంతోమందికి ఆయనే ఎంతో స్ఫూర్తి.. ఆయన అభిమానులని గౌరవించే విధానం కూడా నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా ప్రతి ఒక్కరితో ఎంతో అభిమానంగా మాట్లాడుతారు. చిన్నప్పుడు నేను మా అక్కతో కలిసి షారుక్ ఖాన్ మూవీలను చూసేవాడిని. అందులో ‘దిల్వాలే దల్హనియా లేజాయేంగే’ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమా చాలాసార్లు చూశాను. నాకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం వేసినప్పుడు నేను షారుక్ను మనసులో తలచుకుంటూ వుంటా.. నటన పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగా చాలా గొప్ప వ్యక్తి షారుఖ్ ఖాన్.. నేను పక్కవారితో ఎలా మాట్లాడాలో ఆయన్ని చూసే నేర్చుకున్నాను. నాకు తెలియకుండానే ఆయన నాపై చాలా ప్రభావం చూపారు. ఆయనతో నన్ను పోల్చడం ఎంత మాత్రం సరికాదు అలా చేస్తే ఆయన్ను అవమానించినట్టే అంటూ దుల్కర్ సల్మాన్ షారుక్ ఖాన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.