E Passbook, Minister Vemula Prashanth Reddy, CM KCR, Telangana Farmers News,
15 నిమిషాల్లో “ఈ పాస్ బుక్” తీసుకున్నాను – ప్రత్యక్ష సాక్షిని నేనే: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతులకు వరం*
*15నిమిషాల్లోనే క్రయవిక్రయాలు పూర్తి*
*అత్యంత పారదర్శకమైన,అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది ధరణి పోర్టల్*
*ఇది రైతుల పట్ల కేసీఆర్ కున్న ప్రేమకు మచ్చుతునక*
*దీనికి ఇవాళ ప్రత్యక్ష సాక్షిని నేనే..15నిమిషాల్లో ఈ పాస్ బుక్ తీసుకున్నాను*
*రైతుల తరుపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు*
*దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సౌకర్యం లేదు*
*మంత్రి స్వీయ అనుభవం ఆయన మాటల్లో*
“గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతులకు వరం లాంటిది.ఇది ఒక సాహసోపేత చర్య. రైతులు తమ ఆత్మగా భావించే పంట భూములు కొనుక్కోవాలన్న,అమ్ముకోవాలన్న కొన్నవి తమ పేరుమీద మార్చుకోవాలన్న గతంలో సంవత్సరాల తరబడి కాళ్లు అరిగేలా తిరిగిన రిజిస్ట్రేషన్ కాకపోయేది.కానీ ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల భూముల క్రయవిక్రయాలు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయి.అత్యంత పారదర్శకమైనది.అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది ఈ ధరణి పోర్టల్. రైతు తన క్రయవిక్రయాలను రూపాయి ఖర్చు లేకుండా 15 నిమిషాల్లో పూర్తి చేసుకోవడమే కాకుండా తన పేరుమీద మార్పు చేసుకుని, పాతదైతే పాతవివరాలు, కొత్తదైతే కొత్త వివరాలతో మ్యుటేషన్ దస్తావేజు 15నిమిషాల్లో ఈ-పాస్ బుక్ ఇవ్వడం గొప్ప కార్యక్రమం. ఇట్లా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న ప్రేమకు మచ్చుతునక ఇది. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే. సాయిపేట శివారులో 2ఎకరాల 39 గుంటల భూమిని కొని ఇవాళ వేల్పూర్ మండల తహశీల్దార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కు వస్తే నాపేరుతో కూడిన ఈ-పాస్ బుక్ ను 15 నిమిషాల్లో అందజేశారు.నాకు చాలా సంతోషం అనిపించింది.తహశీల్దార్ కు, కార్యాలయ సిబ్బందికి నా అభినందనలు. ఈ సేవలు ఇట్లాగే రైతులందరికి అందాలి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.”అని అన్నారు.
అనంతరం మంత్రి తహశీల్దార్ కార్యాలయం పరిశీలించారు.రోజువారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు ఆడిగితెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బందిని పేరుపేరునా పలకరించారు. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసులు, తహశీల్దార్ సతీష్ రెడ్డి చేతుల మీదుగా మంత్రి భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఈ-పాస్ బుక్ అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్రా జశేఖర్, కార్యాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.