Ee Single Chinnode Song From Vishwak Sen’s Paagal Movie, Nivetha Pethuraj, Simran Choudhary, Naressh Kuppili, Latest Telugu Movies,
FILM NEWS: విశ్వక్ సేన్ “పాగల్” చిత్రం నుండి “ఈ సింగిల్ చిన్నోడే..” పాట విడుదల.
టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి విశ్వక్ సేన్ యువతను ఆకర్షించే చిత్రాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పాగల్‌కి కూడా యూత్‌లో మంచి బజ్ ఏర్పడింది. ఈ రోజు పాగల్ చిత్రం నుండి `ఈ సింగిల్ చిన్నోడే..` పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సింగల్ చిన్నోడే..న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే..సిగ్నల్ గ్రీనే చూశాడే పరుగులు పెట్టాడే`అంటూ సాగే ఈ పాట సాహిత్యానికి తగ్గట్టుగా హీరో ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం.. అతను ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట అని తెలుస్తోంది.
ఈ సాంగ్‌లో సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. ఈ పెప్పీ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ స్వరపరచగా బెన్నీ దయాల్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఆలపించారు. కృష్ణ కాంత్ సాహిత్యం ఆకర్షణీయంగా ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో విశ్వక్ సేన్ మొదటిసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ని ప్రదర్శించాడు.
నరేష్ కుప్పిలి దర్శకత్వంలో మ్యాజికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది.
హీరోయిన్ నివేథా పేతురాజ్ తీరా అనే పాత్రలో నటిస్తోంది.
సాంకేతిక వర్గం:
బేనర్స్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
సమర్పణ: దిల్‌రాజు
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నరేష్ కుప్పిలి
డిఒపి: ఎస్. మణికందన్
సంగీతం: రధన్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కెకె, అనంత శ్రీరామ్,చంద్రబోస్
ఫైట్స్: దిలీప్‌సుబ్బరాయన్, రామకృష్ణ
డ్యాన్స్: విజయ్ ప్రకాశ్
ప్రొడక్షన్ డిజైనర్: లతా తరుణ్
చీఫ్ కో డైరెక్టర్: వెంకట్ మద్దిరాల,
పబ్లిసిటి డిజైనర్: అనిల్ భాను,
ప్రొడక్షన్ మేనేజర్: సిద్దం విజయ్ కుమార్
పిఆర్ఒ: వంశీ- శేఖర్,వంశీ కాక