తనకు రిటైర్మెంట్ 61ఏండ్ల పెంపు వద్దని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్) ఏనుగు మల్లారెడ్డి అన్నారు.నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన కోసం రెండు దశబ్దాలుగా సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకముగా వ్యవహరించిన విద్యార్థుల వీరోచిత పోరాటం, యువకుల బలిదానంతో సబ్బండ వర్గాల సమిష్టి పోరాటాల పలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్రజాస్వామిక నిర్ణయాలు ఎన్నో తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగస్తులకు 61సంవత్సరాల పదవీవిరమణ వయస్సు పెంపు, నిరుద్యోగ యువకులకు తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, తనకు రిటైర్మెంట్ 61 ఏండ్ల పెంపు వద్దు అని, వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి కూడా చెల్లించడం లేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత, విద్యార్థులు ప్రక్కదారి పట్టే ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు. ఒకవేళ యువత ప్రక్కదారి పడితే దానికి కెసిఆర్, రాష్ట ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా కెసిఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అంతా కూడా పునరాలోచించాలని ఏనుగు మల్లారెడ్డి కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు తనతో కలిసిరావలని పిలుపునిచ్చారు.
NOTE : ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందున సదరు హెడ్ మాస్టర్ పై నిఘా పెట్టాలి.ఆయన స్వస్థలం ఏమిటో చూడాలి. హెడ్ మాస్టర్ మల్లారెడ్డిని ‘తెలంగాణ ద్రోహి’అనే ముద్ర కూడా వేయవచ్చునేమో!! మీరు ఏమంటారు ? కామెంట్ తెలియజేయండి.