Movie News:ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతంగా పెరిగిందని చెప్పుకోవాలి. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు రాసి కన్నా. తెలుగు తమిళ్ హిందీ మలయాళం స్టార్ హీరోల అందరితో నటించి ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన పక్క కమర్షియల్ థాంక్యూ చిత్రాలు ఈ అమ్మడికి ఆశించినంత విజయం చేకూర్చలేకపోయాయి. అయినా తగ్గేదెలే అంటే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు.
రాసి కన్నా సోషల్ మీడియా మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు సినీ విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. అలానే ఫోటో షూట్ లు వ్యక్తిగత ఫోటోలను వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే తాజాగా ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ లో వైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ డ్రెస్ లో ఈ అమ్మడు హాట్ లుక్స్ తో అందాలను ఆరబోస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన తిరు సినిమా పై ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలు విడుదలైన పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ భామకు ఈ చిత్రం సూపర్ హిట్ అని చెప్పుకోవాలి.ప్రస్తుతం రాసి కన్నా హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా ఒక చిత్రం తమిళంలో కార్తీక్ తో చిత్రం నటిస్తుందిఈ రెండు చిత్రాలు ఈ ఏడాదిలో విడుదలకు ముస్తాబుతున్నాయి.