Devotional News:భారతదేశ వ్యాప్తంగా దీపావళి పండుగను అందరు చేసుకుంటూ ఉంటారు. ఆరోజు ప్రతి ఇంట దీపాలతో మెరిసిపోతూ ఉంటుంది. అయితే కొందరిలో దీపావళి ఎందుకు చేసుకుంటారో అనేది ఒక సందేహంగానే ఉంటుంది. దీపావళి లో రెండు కథలు మనం పురాతన కాలం నుండి వింటున్నాము. ఏంటో మీరు కూడా చదివేయండి మరి.
రక్త బీజుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరం చేత మున్నోకాలకు అధిపతి అవ్వాలని కోరుకున్నాడు. అందుచేత దేవతలను అపహరించేందుకు స్వర్గం పై దాడి చేశాడు రక్తబీజడు. రక్త బీజుడు ప్రవర్తన చూసిన దేవతలు భయభ్రాంతి చెంది కైలేశానికి పరుగు తీశారు. వారిని చూసిన పార్వతి అమ్మవారు రక్త బీజడిని సంహరించేందుకు కాళికామాత రూపాన్ని ధరించారు అమ్మవారు. ఈ రూపంలో రక్త బీజుడు సంహరించారు అమ్మవారు తన క్రోధంతో నాట్యం చేస్తూ దేవతలను భయభ్రాంతి చేసింది అమ్మవారు.
అయితే దేవతలు అందరూ ఆ మహాదేవుడు దగ్గరికి చేరుకొని విషయాన్ని వివరించడం జరిగింది. రాక్షసులను సంహరిస్తూ వారి రక్తాన్ని తాగుతూ అమ్మవారు ఉగ్రరూపం లో నాట్యం చేస్తున్న అమ్మవారిని శాంతించేందుకు మహా శివుడు మరణించిన వ్యక్తి వలే పడుకుంటారు. అమ్మవారు నాట్యం చేసుకుంటూ ఆ మహాదేవుడు మీద కాలు మోపడం జరుగుతుంది కిందకి చూసిన అమ్మవారు తన కాలు వేసింది తన భర్త మీద అని గ్రహించి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు శాంతి ఇస్తారు. ఇలా రక్త బీజుడు నుండి విముక్తి పొందడంతో దీపాలను అర్పిస్తారు దేవతలు. దీపావళి ముందు రోజున కాళికా మాత స్మరించుకుంటూ కాళీ చతుర్దశి జరుపుకుంటారు. ఇది ఒక కథగా చెప్పుకుంటారు. మరొక కథ గా శ్రీరాముడు వనవాసాన్ని పూర్తి చేసుకొని అయోధ్యకి తిరిగి రావడంతో అయోధ్య ప్రజలు శ్రీరాముడు సీతమ్మ దీపాల వెలుగులో ఆహ్వానిస్తారని దానిని దీపాల పండుగ అని చెప్పుకోవడం జరుగుతుంది.