Crime News: నిజామాబాద్ లో విషాదం అలుముకుంది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్థానిక కపిల హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యాపారాల నష్టం రావడం వల్ల ఇటువంటి దారుణానికి వడగట్టారని సమాచారం ఏదేమైనాప్పటికీ చిన్న పిల్లలకు కూడా మరణించడం బాధాకర బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ జిల్లాకు చెందిన సూర్య ప్రకాష్ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు గత కొన్నేళ్లుగా వ్యాపారంలో నష్టాలు చెవి చూస్తున్నారు సూర్యప్రకాష్. అప్పులు మరింత పెరగడంతో కుటుంబాన్ని తీసుకొని నిజామాబాద్‌లో కపిల హోటల్ లో గత వారం నుంచి ఉంటున్నారని సమాచారం వినిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం సూర్య ప్రకాష్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా మృతదేహాలుగా అక్కడి పనివారికి కనిపించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న హోటల్ యజమానులు వెంటనే పోలీస్ బృందానికి తెలియజేశారు.హుటాహుటిగా అక్కడ చేరుకున్న పోలీసులు వారి శరీరాన్ని పరిశీలించగా. సూర్యప్రకాశ్ భార్యకి పిల్లలకు పురుగుల మందు కలిపి తాగించారు ఆ తరువాత ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్ ఎంక్వైరీ లో తేలింది.
ప్రస్తుతం వీరి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచడం జరిగింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, కుటుంబం ఆత్మహత్యకు గల కారణాల?లేదా వ్యాపారాలు నష్టం లేదా ఇంకేమైనా వ్యక్తిగత విషయాలు ఏమన్నా అనే విషయంపై పోలీసుల దర్యాప్తు చేయడం జరుగుతుంది.వీరికి సంబంధించిన బంధువులను పోలీసులు సంప్రదించడం జరిగింది.