Filmfare awards 2022 winners బాలీవుడ్లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను ఫిల్మ్‌ఫేర్ ఎడిటర్ నేతృత్వంలోని బృందం ప్రకటించింది. ఈ ఏడాది షేర్షా, సర్దార్ ఉద్దమ్, మిమీ సినిమాలు ఎక్కువ అవార్డ్స్ సాధించాయి.
1983లో వరల్డ్ కప్ నేపథ్యంలో వచ్చిన 83 సినిమాలో అద్భుత నటన ప్రదర్శనకుగానూ హీరో రణ్ వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. మిమి మూవీలో ప్రధాన పాత్రలో నటించిన కృతి సనన్ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ గెలుచుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును సుభాష్ ఘాయ్ సొంతం చేసుకున్నారు. వీరితో పాటు మరికొందరు స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. ఇక ఇతర విభాగాల్లో అవార్డులు సాధించిన వారి విషయానికొస్తే…పాపులర్ అవార్డ్స్…
ఉత్తమ చిత్రం: షేర్షా (ధర్మ ప్రొడక్షన్స్)
ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా)
ఉత్తమ నటుడు: కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ (83)
ఉత్తమ నటి: కృతి సనన్, మిమీ రాథోడ్‌గా మిమీ
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమీ)
ఉత్తమ సహాయ నటి: సాయి తమంకర్ (మిమీ)