Crime ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దేవీ నవరాత్రుల సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మవారికి హారతిస్తున్న సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించగా, దాదాపు 64 మంది గాయాల పాలయ్యారు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భదోహికి చెందిన ఔరాయ్ కొత్వాలికి సమీపంలో నార్తువాలో ఉన్న దుర్గా పూజా మండపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులంతా భయాందోలనకు గురయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా.. 64 మంది గాయాలపాలు అయినట్టు సమాచారం.. ఈ ప్రమాదంలో అంకుష్ సోని (12), 10 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల మహిళ మృతి చెందగా, 64 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.. ప్రమాదంలో అధికంగా చిన్నపిల్లలు మహిళలే ఉన్నట్టు సమాచారం. అయితే వీరిలో దాదాపు 20 మందికి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మంటలు అంటుకున్న విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయినప్పటికీ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.. షాట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని.. అయితే ఆ సమయానికి అక్కడ దాదాపు 300 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అగ్ని ప్రమాదంలో మండపం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు భదోహి జిల్లా కలెక్టర్ గౌరంగ్ రాఠీ చెప్పారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.