Crime ముంబైలో పట్టు పగలే కాల్పుల కలకలం రేగింది రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నడిరోడ్డు పైన గన్నులు తీసి గాలిలో కాల్పులు జరపడం చుట్టూ ఉన్న మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సమాజం ఎటువైపు పోతుందో అసలు అర్థం కావడం లేదు హత్యలు మానభంగాలకు తోడు తుపాకీలు కూడా విచ్చలవిడిగా రాజ్యాలు ఏలుతున్నాయి మొన్నటి వరకు పంజాబ్లో కలకలం రేపిన తుపాకీ ప్రస్తుతం ముంబై ని కూడా చేరింది ఎక్కడో అనుకుంటే ఏమో కానీ నడిరోడ్డు పైన కొందరు తుపాకీలో తెలిసి గాలిలో రౌండ్లు కాల్చడంతో చుట్టూ ఉన్న ప్రజలంతా దిక్కుతోచని పరిస్థితుల్లో పరుగులు తీశారు ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది..
అంబర్‌నాథ్‌లో ఆదివారం రాత్రి ఎద్దుల బండి పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ జరిగింది ఈ గొడవ కాస్త తీవ్ర దుమారానికి దారితీసింది.. దీంతో ఒక వర్గం వ్యక్తులు మరొక వర్గం వారిని భయపెట్టడానికి తుపాకీ తీసి నడిరోడ్డు పైన గాలిలో 15 నుంచి 20 రౌండ్లు కాల్చారు దీంతో ఎదుటివారు కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే ఇది చూస్తూ ఉన్నా చుట్టూ ఉన్న ప్రయాణికులు మాత్రం కార్లు వెనుక దాక్కోటానికి పరుగులు తీశారు.. ఈ సంఘటనను ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అందరిని భయభ్రాంతులకు గురిచేస్తుంది.. ఈ వీడియో చూసిన వారంతా మన దేశం ఎటు పోతుందో అర్థం కావడం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు..
https://twitter.com/BHARATGHANDAT2/status/1591792409939435520?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1591792409939435520%7Ctwgr%5E9bf5da1724b0956dd9b7aab0b1bd5d1285eff002%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fnational%2Fheavy-firing-on-street-near-mumbai-amid-fight-between-2-groups-telugu-news-au42-820991.html