Devotional News: ఏ మతంలోనైనా దేవుని వద్ద ప్రతి ఒక్కరు పవిత్రంగా తమ ప్రార్థనలను అర్పిస్తారు. అలాంటి మున్నోకాలను ఏలే సర్వేశ్వరునికి మన అర్పించేవి పవిత్రమైన పువ్వులు పండ్లు వంటివని చెప్పుకోవాలి. అయితే చాలామందిలో ఒక ప్రశ్న అనేది మెదులుతూ ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేవునికి పువ్వులను సమర్పించడం ఒక ఆనవాయితీగా మన పురాతన కాలం నుండి మనం అవలంబిస్తున్నాం. పువ్వులు దేవుని పూజలు ఎందుకు వినియోగిస్తారు అనే విషయాన్ని తెలుసుకుందామా మరి!!!
భక్తి పూర్వకంగా నిండు మనస్సుతో ఎవరైతే పుష్పాలను, పండును, జలాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ‘గీత’లో వివరించడం జరిగింది.ఆరాధనతో దైవాన్ని నిష్కపటమైన మదితో పూజించి తరిస్తారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు వెన్నంటే ఉండి వారిని కష్టసుఖాలలో కాపాడుతారని సాక్షాత్తు శ్రీక్రిష్ణభగవానుడే తెలిపారు.అందువల్ల దేవుని పూజలో పుష్పాలు తప్పనిసరి అని చెప్పడంలో సందేహం లేదు.
దేవుని పూజలు పువ్వులు సమర్పించడం అనేది పవిత్రమైనదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛమైన మనసుతో పువ్వును అర్పించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని కొన్ని శాస్త్రాలలో వివరించడం జరిగింది. స్త్రీలు బహిష్టులైన సమయంలో పూలను తాకరాదు. ఒకవేళ అలా తాకిన వెంటనే పసుపు నీటిని ఆ చెట్టుపై కొంచెం జిమ్మ వలెను. మన భారతదేశంలో ఒక్కరోజులోనే కొన్ని కోట్ల పువ్వు లు దేవునికి సమర్పించడం అనేది విశేషంగానే చెప్పుకోవాలి. అయితే స్త్రీలు పూజలు చేస్తున్నప్పుడు తన జడ ముడిలో తులసీదళాన్ని పెట్టుకొని పూజించడం మంచిదట. ఈ విధంగా దేవుని పూజలో పుష్పాలను అర్పించడం అనేది ఒక గొప్ప విశేషంగానే చెప్పుకోవాలి.