Health కూర్చొనివ్వని నిల్చోనివ్వని బాధ కిడ్నీలో రాళ్లు. పొత్తి కడుపులో మొదలై వెనక భాగానికి వెళ్లే బాధ చాలా విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొన్ని అరగని పదార్థాలు, ఇసుకరేణువులుగా మారి అవి గట్టి పదార్థాలుగా మారిపోతాయి. ఇవి కిడ్నీ అంచుల్లోనే మూత్రశయం లోని నిల్వ ఉండిపోతాయి. వాటి చుట్టూ రక్తం పేరుకుపోయి విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది..
ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు వాంతులు, వికారం అంటే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి ఒకటే కారణం అని చెప్పలేము. తీసుకునే ఆహారం, నీరు వంటివి చుట్టూ ఉండే పరిస్థితులు సైతం వీటికి కారణం. అలాగే వంశపారపర్యంగా కూడా కొన్ని సార్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం, ద్రవపదార్థాలు తక్కువగా తీసుకోవడం వంటివి కూడా కారణం. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అని తెలిసిన వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను మానేయడం వల్ల ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు..
ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్లు, పళ్ళ రసాలను ఎక్కువగా తీసుకుంటూ కొబ్బరినీళ్లు, బార్లీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే రాగి చెంబులో ఉంచిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. బయట దొరికే అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్లను తీసుకోవడం మానేయాలి. పిజ్జా, బర్గర్లు వంటి వాటికీ దూరంగా ఉండాలి. కూరగాయలు, పులుపు పదార్థాలు, పప్పు వంటి వాటిని తీసుకోకూడదు