సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 351 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదరెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి ,స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :
వృత్తిని నమ్ముకుని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. గతంలో కూడా ఇచ్చేవారు కాకపోతే అది అప్పుగా ఇచ్చేవారు. దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ముదిరాజు, బెస్త, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ్, యాదవ సోదరులు ఇలా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించారు.
కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు బిసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కుల వృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయి. గ్రామీణ వృత్తులకు జవసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసే సంకల్పంతో కెసిఆర్ ప్రభుత్వం యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచింది.
బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం తెలంగాణ రాష్ట్రంలో మత్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, ఈ రంగంపై ఆధారపడిన మత్స్యకారులకు ప్రత్యక్షంగా, ఈ రంగంపై ఆధారపడిన పరోక్షంగా ఉపాధి లభించేలా ప్రభుత్వం వారికి ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలనిస్తూ, చెరువుల్లో పెంచుతున్నది. గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా, వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నది. గౌడ సోదరులకు తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక, పాత బకాయిలనూ మాఫీ చేసింది. లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చేనేత మిత్ర పథకం ద్వారా సబ్సిడీ కల్పిస్తున్నాం. తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు, 7580 విద్యార్థులు ఉంటే, నేడు 310 బీసీ గురుకులాల్లో 2022-23లో 33స్కూళ్లను,15 డిగ్రీకాలేజీలు నూతనంగా ఏర్పాటు చేసి, పాతవాట్లో 119 జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసాం అన్నింట్లో కలిపి 1,81,880 విద్యార్ధులు ఉన్నారు. బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న కేసీఆర్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలు ఇవి.
గత పాలకులకు రాని ఆలోచన, గత పాలకులు చేయని సంక్షేమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామంటున్నారు …మూడు పంటలకు కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా మూడు గంటలు కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా, ఒకప్పుడు కేసీఆర్ గారు గజ్వేల్ లో గెలవక ముందు గజ్వేల్ వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. రోడ్లు కూడా ఉండేవి కాదు. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. త్వరలో మరో వంద పడకల ప్రభుత్వాసుపత్రి గజ్వేల్ లో ప్రారంభించబోతున్నాం.